Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బల్దియా మేయర్ గుండు సుధారాణి
- డయాగస్టిక్ ల్యాబ్,పల్స్ ఆక్సీమీటర్స్ ప్రారంభం
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలు వేలకట్టలేనివని బల్దియా మేయర్ గుండు సుధారాణి అన్నారు. ఆదివారం సుబేదారి, హన్మకొండ రెడ్ క్రాస్ సొసైటీలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాగస్టిక్ ల్యాబ్,పల్స్ ఆక్సీమీటర్ల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై ప్రారం భించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ ప్రపం చ వ్యాప్తంగా సేవలు అందిస్తున్నారని, రెడ్ క్రాస్ సంస్థ తలసేమియా భాదితులకు అండ గా ఉంటూ వారికి అవసరమైన క్రమంలో రక్తాన్ని అందజేస్తువారి ప్రాణాల సంరక్షణకు పాటు పడడం అభినం ద నీయమన్నారు. నగరవ్యాప్తంగా 3 ప్రాంతాల్లో జనరిక్ మెడికల్ దుకాణాల ద్వారా అతి తక్కువ ధరకు మందులు అందజేయడం వల్ల పేద ప్రజలకు మేలు జరుగుతున్నదని తెలిపారు. కుట్టు మిషన్ లను ఏర్పాటు చేసి, శిక్షకురాలిని నియ మించి ఔత్సాహిక మహిళలకు శిక్షణ ఇవ్వడం, మదర్ థెరిస్సా చూపిన బాటలో పయనిస్తూ సేవలు అందించడం రెడ్ క్రాస్ కె సాధ్యమన్నారు. అమెరికాలో ఉంటూ ఇక్కడి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కషి చేస్తు 1100 పల్స్ ఆక్సీమీటర్ లను అందజేసిన వైద్యులు డా. దివాకర్ ఉదారతను మేయర్ ప్రశంసించారు. ఎం.పి.లాడ్స్ నిధుల నుండి రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావు అందజేసిన బయో కెమిస్ట్రీ అనలైజర్ ను కూడా మేయర్ ఈ సందర్భంగా ప్రారంభించారు. అంతకు ముందు మేయర్ గుండు సుధారాణి రెడ్ క్రాస్ సొసైటీ ఆవరణలో మొక్కలను నాటారు.అనంతరం తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు ఏర్పాటుచేసిన ఆహార పొట్లాలను మేయర్ అందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మెన్ డా.విజయ చందర్ రెడ్డి, ఐఎంఏ అధ్యక్షులు డా.సుధీర్, తానా అధ్యక్షులు డా.ప్రవీణ్, రెడ్ క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఈవీ.శ్రీనివాస్, డా.విజయలక్ష్మి , రిటైర్డ్ ఆర్ఎంఓ. డా.శివ కుమార్ పాల్గొన్నారు.