Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
- రూ.4.50 కోట్లతో ఇంటిగ్రేటడ్ వెజ్,నాన్ వెజ్, ఫ్రుడ్స్ మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-నర్సంపేట
మోడల్ సిటీగా తీర్చిద్దాలనే లక్ష్యంతో వేగవంతంగా పనులను చేపడుతున్నట్టు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. అంగడీ మైదానంలో రూ.4.50 కోట్లతో మంజూరు అయిన ఇంటిగ్రేటడ్ వెజ్, నాన్ వెజ్, ఫ్రుడ్స్, ప్లవర్ మార్కెట్ భవన నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజల మౌళిక సదు పాయాలను కల్పించడానికి ప్రభుత్వం కోట్లాది నిధులు మంజూరు చేసిందన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మంత్రి కేటీఆర్ అడిగిన ప్రతి పనికి నిధులు కేటాయించారని తెలిపారు. ఇప్పటికే రూ.2 కోట్లతో కూరగా యల మార్కెట్‌ను నిర్మించామన్నారు. నూతనంగా రూ.4.50 కోట్ల వ్యయ ంతో జీప్లస్ టూ భవనంలో ఒక్కో అంతస్తుకు 18 వేల చదరపు అడుగుల చొప్పున గ్రౌండ్ ఫ్లోర్ రెండు అంతస్తులతో కలిపి మొత్తంగా 58 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను నిర్మించబోతున్నామని తెలిపారు. 46 నాన్ వెజ్ స్టాల్స్, 72 వెజ్ స్టాల్స్, 18 ఫ్రూట్స్ స్టాల్స్, 10 ఫ్లవర్ స్టాల్స్, 5 ఫిష్ కట్టింగ్, క్లినింగ్ కోసం ప్రత్యేకంగా 6 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మార్కెట్‌కు వచ్చే వినియోగదారులకు, రైతులకు ఇబ్బందులు ఎదుర్కోకోకుండా 8వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఏరియా గ్రౌండ్లో పార్కింగ్ సౌకర్యం కూడా ఉంటుందన్నారు. రైౖతులకు, వినియోగదారులకు నాణ్యమైన సరుకులు నిల్వ చేసుకొనేందుకు రూ. 50 లక్షలతో కోల్డ్ స్టోరేజ్ నిర్మించనున్నట్లు తెలిపారు. కొత్తగా నిర్మించిన మోడల్ వెజిటబుల్ మార్కెట్లోకి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలని చిరు వ్యా పారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, వైస్ చైర్మెన్ మునిగాల వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు, పలువురు అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.