Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే టీకాలు వేయాలి
- జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణికి వినతి
నవతెలంగాణ-హసన్‌పర్తి
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణికి డీఎస్పీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు అధినాయకులు డా.విశారదన్ మహరాజ్ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో కలెక్టర్లకి సోమవారం ముఖ్యమైన 07 డిమాండ్స్‌తో వరంగల్ అర్బన్ జిల్లా దళిత్ శక్తి ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ సంధ్యారాణికి వినతిపత్రం ఇచ్చారు. 18 ఏళ్ళు నిండిన వారందరికీ ఇంటివద్దనే ఉచిత కొవిడ్ టీకాలు (వ్యాక్సినేషన్) అందించాలని, కరోనా బారిన పడ్డ బాధితులందరికీ పూర్తి ఉచిత వైద్యం అందించాలని, కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ప్రతి గ్రామంలో ఉచిత కరోనా చికిత్స కేంద్రాలను (తాత్కాలిక గుడారాలు/టెంట్ లను) నిర్మించాలని, కరోనా బారిన పడ్డ పేద కార్మిక కుటుంబాలకు నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం, నూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్స్ (పౌష్టికాహార పాకెట్లు) ప్రభుత్వమే అందించాలని వినతి పత్రంలో కోరారు. ప్రభుత్వం స్పందించని యెడల డిమాండ్ల అమలు కొరకై డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ నెల 14న కలెక్టరేట్ల ముందు ధర్నా ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీఎస్పీ కన్వీనర్ శ్రీకాంత్ మహరాజ్, జిల్లా మీడియా ఇంచార్జ్ పూర్ణచందర్ మహరాజ్, మండల కన్వీనర్స్ రాజేష్ మహరాజ్, శ్రవణ్ మహరాజ్ లు తదితరులు పాల్గొన్నారు.