Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చెన్నారావుపేట
వారం రోజుల క్రితం మండలంలోని తిమ్మరాయిని పాడు శివారులోని చంద్రు తండాకి చెందిన బానోతు చందూలాల్ అనే యువకుడు తన ఇంటి రేకులు సరిచేస్తుండగా, బాగా వీచిన గాలితో రేకులతో సహా కింద పడడంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కష్ణ చైతన్య బాధిత కుటుంబాన్ని పరమార్శించడానికి వెళ్ళినప్పుడు, ఆ తండా యువకులు, మతుడి కుటుంబ సభ్యులు తమ వేదనని యువ నాయకుడికి చెప్పుకున్నారు. వారు నిర్మించబోయే గహానికి సిమెంట్ బస్తాలు నేనే పూర్తిగా ఇస్తానని హామీ ఇచ్చి, భవిష్యత్తులో కూడా మీ కుటుంబ సభ్యుల్లో ఒకడిగా ఉండి మీకు తోడుంటానని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇంటికి కావాల్సిన 40 సిమెంటు బస్తాలను తండా యువకుల ద్వారా సోమవారం ఆ కుటుంబ సభ్యులకు అందించారు.
కష్ణ చైతన్యకి కతజ్ఞతలు
మతుడి కుటుంబ పరిస్థితికి చలించి,ఇంటికి అవసరమయ్యే సిమెంట్ని అందిస్తానని చెప్పడమే కాకుండా సోమవారం సిమెంట్ అందించినందుకు తండా యూత్ తరుపున,చందూలాల్ కుటుంబ సభ్యుల తరుపున ప్రత్యేక కతజ్ఞతలు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రు తండా యూత్ అధ్యక్షుడు జాటోతు శేఖర్,సభ్యులు భూక్య భద్రు, గుగులోతు స్వామి, బానోతు శ్రీను,గుగులోతు బాలు, గుగులోతు వెంకన్న, లావుడ్య బాలు, గుగులోతు కిరణ్, జవహర్ లాల్ పాల్గొన్నారు.