Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కరోనా నియంత్రిత చర్యలు తీసుకుంటూనే, నాలుగు కోట్ల జనాభాకు వ్యాక్సిన్ అందిం చాలని సంకల్పించగా, ముందుచూపులేని కేంద్ర ప్రభుత్వ వైఫల్య కారణంగా సకాలంలో ప్రజలకు వ్యాక్సిన్ వేయ డంలో ఆలస్యమవుతోందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య అన్నారు. సోమవారం నియోజకవర్గ కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో కరోనా నియంత్రణ చర్యలు, జ్వర సర్వే పై ఆరాతీశారు. ఈ క్రమంలో ఓ నిండు గర్భిణితోపాటు తన భర్తకి కరోనా రాగా హోమ్ ఐసోలేషన్ లో ఉండగా బాధితురాలి కుటుంబాన్ని సందర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ మూలంగా కరోనా తగ్గు ముఖం పట్టిందన్నారు. కరోనా బాధితులు భయాం దోళన చెందొద్దని, వైద్యుల పర్యవేక్షణతో నియంత్రిత చర్యలు పాటించాలన్నారు. మనోధైర్యమే కరోనాకు ఔషధమని అన్నారు. కరోనా నియంత్రణకు ఆయుధం మాస్కు అని అన్నారు. కరోనా మూడో దశలో చిన్న పిల్లలపై ప్రభావితం చూపుతుందన్న అపోహలు వీడాలన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడంలో అనుమా నాలకు తావ్వివ్వొద్దన్నారు. కరోనా కట్టడిలో నిర్విరామంగా విధులు నిర్వర్తిస్తున్న వైద్య సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం జిల్లా అధికార ప్రతినిధి తాటికొండ సురేష్‌కుమార్, ఎంపీటీసీ రాజు, వార్డు సభ్యులు గాండ్ల శోభన్‌బాబు, డాక్టర్ శ్రీవాణి, నాయకులు మునిగాల రాజు, మారేపల్లి ప్రసాద్, గుండె మల్లేశం, సమ్మయ్య, ఆశా, అంగన్వాబా కార్యకర్తలు పాల్గొన్నారు.