Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష
నవతలంగాణ-భూపాలపల్లి
కరోనా కట్టడిలో, వైద్యమందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని జెడ్పీ ఫ్లోర్ లీడర్ లింగమల్ల శారద దుర్గయ్య, అధికార ప్రతినిధి అజ్మీర జంపయ్య, ఇంటలెక్చువల్ రాష్ట్ర కోఆర్డినేటర్ చల్లూరి మధు విమర్శించారు. సోమవారం తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ జయశంకర్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ కార్యాల యంలో పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడారు. కరోనా బాధితులను పూర్తిస్థా యిలో ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కరోనా, బ్లాక్ వైట్ ఫంగస్‌ను ఆరోగ్యశ్రీలో చేర్పించి ఉచిత వైద్యమందించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై పెట్టినంత దృష్టి కరోనా పై ఎందుకు పెట్టట్లేదని ప్రశ్నించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్రం సామాన్యుడిపై మోయలేని భారాలు మోపుతోందన్నారు. నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతున్నారని ఆరోపించారు. కరోనా టీకాలు వేయించడంలో విఫలమయ్యాయన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని మెరుగైన వైద్యమందించాలని డిమాండ్ చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంపటి భువనసుందరి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గంట దేవేందర్ రెడ్డి, బట్టు కర్ణాకర్, పొనకంటి శ్రీనివాస్, కంచర్ల సదానందం, కొలేపాక ప్రసంగి, రమణాచారి, పైతారి రాజు, ఉస్మాన్, నజీర్ పాల్గొన్నారు.
జనగామ : కరోనా బాధితులు, బ్లాక్ ఫంగన్ వచ్చిన వారికి ప్రయివేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యమందించాలని కోరుతూ జ నగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇన్చార్జఇ చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాసాన్‌పల్లి లింగజి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మపురి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ప్రయివేటు హాస్పిటల్లో దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. యూత్ కాంగ్రెస్ జనగామ నియోజకవర్గ అధ్యక్షులు యాట క్రాంతికుమార్, సోషల్ మీడియా కన్వీనర్ పిట్టల సతిష్, ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రె రాజశేఖర్, జనగామ నియోజకవర్గ సోషల్ మీడియా కో కన్వీనర్ ఫయాజ్ పాల్గొన్నారు.