Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకారెడ్డి
నవతెలంగాణ-జనగామ
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస, పప్పు, బియ్యం, మంచి నూనె ఇతర నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని సీపీఐ(ఎం) జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ధరల పెంపునకు నిరసనగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జనగామలోని నెహ్రూ పార్క్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిత్యావసర ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారాలు వేసి ప్రజలపై మోడీ మొసలి కన్నీరు కారుస్తు న్నారని విమర్శించారు. ఆర్థిక సంక్షోభం, కరోనా వైరస్ ఫలి తంగా దేశ ప్రజలు ఆదాయం కోల్పోయి ఇబ్బంది పడు తున్నారన్నారు. ఉపాధి కోల్పోయి కోట్లాది మంది ప్రజలు తినలేని పరిస్థితులు ఏర్పడినా ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కరోనా కాలంలో ప్రజల ఆదాయం జీరోకు పడిపోగా కార్పొరేట్ శక్తులు అంబానీ, ఆదాని ఆదాయం 70శాతం పెరగడం సిగ్గుచేట న్నారు. కరోనా కాలంలో వ్యాపారస్తులు బ్లాక్ దందాలకు పాల్పడుతూ అధిక ధరలకు నిత్యావసర సరుకులు అమ్ము కుంటున్నా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేేదన్నారు. ఇప్పటికైనా నిత్యావసర సరుకుల ధరలు తగ్గించి ప్రజలను ఆదుకో వాలన్నారు. ఒక్కో కుటుంబానికి నెలకు రూ.7500, 16 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ప్రయివేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఆర్ రాజు, బి గోపి, బి శేఖర్, విజేందర్, నాయకులు ప్రకాష్, ఎండీ అజార్, మల్లయ్య, లలిత, లింగం, ఉపేందర్, మునీరు, వరలక్ష్మి, అంజమ్మ, శివ, రజిత, కళ్యాణ్, వెంకటేష్, మల్లేశం, ఎండీ మైబెల్లీ, పోశవ్వ, సుహాసిని, మాధవి తదితరులు పాల్గొన్నారు.