Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరి ధాన్యం మొలకెత్తిందని దిగుమతికి నిరాకరిస్తున్న మిల్లర్లు
- ధాన్యం దిగుమతి చేసుకోవాలని కోరుతున్న నిర్వాహకులు
నవతెలంగాణ-శాయంపేట
కొనుగోలు కేంద్రం నుంచి లారీలలో తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడంలో రైస్ మిల్లు యాజమాన్యం కొర్రీలు పెడుతున్నారు. ధాన్యం మొలకెత్తిందని, తాము దిగుమతి చేసుకోమని ఖరాఖండీగా చెబుతుండడంతో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు. మండల పరిధిలోని గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో నాలుగు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ అధికారులు ఏర్పాటు చేశారు. మహిళా సంఘం గ్రూపు సభ్యులకు శిక్షణనిచ్చి వరి ధాన్యం కొనుగోలు చేయిస్తున్నారు. రవాణా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల లారీలు అరకొరగా వస్తుండడంతో కొనుగోలు కేంద్రం మహిళా నిర్వాహకులు స్థానిక ప్రజా ప్రతినిధులను ఆశ్రయించి ప్రైవేటు లారీలలో ధాన్యం ఎగుమతి చేస్తున్నారు. శాయంపేట గ్రామంలోని కొనుగోలు కేంద్రం నుండి గత ఎనిమిది రోజుల క్రితం 17 శాతం లోపు ఉన్న వరి ధాన్యాన్ని తూకం వేసి మందారి పేట లోని శ్రీనివాస రైస్ మిల్లు కు తరలించారు. అక్కడ వేబ్రిడ్జ్ వేశాక దిగుమతికి పరకాల మార్కెట్ గోదాం కి పంపించారు. ఈ లోపు వర్షాలు కురవడం ధాన్యం తడిసి మొలకెత్తడంతో ధాన్యాన్ని దిగుమతి చేయకుండా తిరిగికి మిల్లుకు తరలించారు. మొలకెత్తిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోమని అక్కడి సిబ్బంది తెలపడంతో నిర్వాహకులు సోమవారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. తాము తూకం వేసి పంపినప్పుడు ధాన్యం తడవ లేదని, ధాన్యం దిగు మతిలో ఆలస్యం వల్ల ధాన్యం బస్తాలు తడిచాయని నిర్వాహకులు తెలిపారు. అయినప్పటికీ తాము వెయ్యి లారీల ధాన్యం కొనుగోలు చేశామని, తమ టార్గెట్ పూర్తి అయిందని తాము దిగుమతి చేసుకోమని రైస్ మిల్లు సిబ్బంది తెలియజేశారు. అక్కడే ఉన్న లారీ డ్రైవర్లు రాస్తారోకో చేపట్టడం, విషయం తెలుసుకున్న సిఐ రమేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకోవడంతో కొనుగోలు కేంద్రం నిర్వాహ కులు తమ సమస్యను సిఐ రమేష్ కుమార్ దష్టికి తీసుకెళ్లారు. ఆలస్యంగా ధాన్యం బస్తాలు దిగుమతి చేయడంవల్ల వర్షానికి తడిసిన ధాన్యం మొలకెత్తిందని, ఇందులో తమ తప్పు లేదని తెలిపారు. ఈ విష యాన్ని ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికైనా ఉన్నతా ధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లుల యజమాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. కాగా తడిసిన ధాన్యం దిగుమతి చేసుకోకపోవడంపై రైస్ మిల్లు యజమానిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండడం గమనార్హం.