Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్య వేదిక డిమాండ్
నవతెలంగాణ-మట్టెవాడ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న 23 సంఘాలు ఐక్యవేదిక సోమవారం వరంగల్ అర్బన్ రూరల్ జిల్లా వైద్య అధికారులకు, ఎంజీఎం ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ చంద్రశేఖర,్ కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యకి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వైద్యులకు ప్రభుత్వం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించినట్లు ఇతర వైద్య సిబ్బందికి కూడా అందిం చాలన్నారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో 10 శాతం ఆక్సిజన్ బెడ్ లతో కూడిన వైద్యం అందించాలని కరోనాతో మతి చెందితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యాభై లక్షలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షలు కలిపి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా అందించాలని చనిపోయిన ఉద్యోగి కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐక్యవేదిక నాయకులు బత్తిని సుదర్శన్ గౌడ్, స్టేట్ కో రో కమిటీ మెంబెర్ రామ రాజేష్ ఖన్నా, యధానాయక్ , బానోత్ నెహ్రూ చంద్, జిల్లా ఐక్యవేదిక నాయకులు ఓ.సందీప్ కుమార్, డా.నాగ శశికాంత్, డా. మహేందర్ ఏ. వెంకటేశ్వర్ వర్మ, రేవూరి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సుబేదారి : మెడికల్ అండ్ హెల్త్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ జిల్లా అదనపు కలెక్టర్ జీ. సంధ్య రాణికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ఐక్యవేదిక నాయకులు బత్తిని సుదర్శన్ గౌడ్, స్టేట్ కోర్ కమిటీ మెంబెర్ రామ రాజేష్ ఖన్నా, యధానాయక్, బానోత్ నెహ్రూ చంద్ , జిల్లా ఐక్యవేదిక నాయకులు సందీప్ కుమార్, డా.నాగ శశికాంత్, డా.మహేందర్ ఏ. వెంకటేశ్వర్ వర్మ, రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.