Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
28వ డివిజన్ పేటలోని గుజరాతీ భవన్లో సూపర్స్ప్రైడర్స్ అయిన వ్యాపార, వాణిజ్య, చాంబర్ ఆఫ్ కామర్స్, గుమస్తాలకు, సిబ్బందికి వాక్సినేషన్ ప్రక్రియను సోమవారం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ తూర్పు నిత్యం వ్యాపారాలకు కేంద్రమని, నిత్యావసర సరుకుల రవాణా,ఇతర వ్యాపారాలు జరుగుతుంటాయని వారి రక్షణ తమ బాద్యతగా బావించి వారికి, చాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపారస్తులు వారి సిబ్బందికి, హమాలీలు, గుమస్తాలు.వాక్సిన్ వేయించుకోవటం ద్వారా కరోనా వస్తే ప్రాణాలు కోల్పోయే రిస్క్ నుంచి తప్పించుకున్న వాళ్ళవుతారని తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ సెంటర్ను వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు గందె కల్పన నవీన్, దిడ్డి కుమారస్వామి, ఎంఎచ్ఓ రాజారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ టీ.రమేష్ బాబు, మాజీ కార్పోరేటర్లు, చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.