Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి
- వ్యకాస జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య
నవతెలంగాణ-మహబూబాబాద్
గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని వ్యకాస జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని కంబాలపల్లి, నడివాడ గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనులను ఆ సంఘం జిల్లా కమిటీ బృందం సోమవారం పరిశీలించింది. పని ప్రదేశాల్లో కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వీరయ్య మాట్లాడారు. ఒక్కో చోట 3 నుంచి 7 వారాల వరకు కూలీల బిల్లులు చెలించాల్సి ఉందన్నారు. కంబాలపల్లి, నడివాడల్లో 4 వారాల డబ్బు లు రాలేదన్నారు. వారానికోసారి బిల్లులు చెల్లించాలన్న నిబంధనను అధికారుల ఉలంఘిస్తున్నారని చెప్పారు. పని ప్రదేశాల్లో తాగునీటి, టెంట్, ఇతర సదుపాయాలు కల్పించడం లేదని తెలిపారు. కూలీలకు పనిముట్లు సైతం ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతన బిల్లులు విడుదల చేయడంతోపాటు దరఖాస్తు చేసుకున్న అందరికీ పని కల్పించాలని, పని కల్పించలేని పరిస్థితి ఉంటే నిరుద్యోగ భృతి ఇవ్వాలని, మాస్కులు, శానిటైజర్లు అందించా లని, కూలీలకు కరోనా వ్యాక్సిన్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం మండల నాయకులు చేపూరి గణేష్, రాజు, మునగల ఉపేందర్, ఎల్లయ్య, సునీత, అనిల్ పాల్గొన్నారు.