Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ బాధితులకు ఆహారం, పండ్లు పంపిణీ
నవతెలంగాణ-గార్ల
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ప్రయివేట్ ఆస్పత్రుల్లో ఫీజులను నియంత్రించాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కందునూరి కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసోలేషన్లో ఉన్న కరోనా బాధితులకు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం భోజన ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. మూడో దశకు ముందే ప్రజలందరికీ వ్యాక్సీన్ వేయాలని ప్రభుత్వానికి సూచించారు. కరోనాను కట్టడి చేయడంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభు త్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పో యిన పేదలను ఆదుకోవడంలోనూ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాసంఘాలు, పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి కరోనా బాధితులను అదుకోవాలని కోరారు. ఐద్వా బృందాన్ని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పానుగంటి రాధాకష్ణ అభినందించారు. కార్యక్రమంలో సీపీఐ (ఎం) మండల కార్యదర్శి గిరిప్రసాద్, నాయకులు ఈశ్వర్ లింగం, తాళ్లపల్లి రమ, చుక్కమ్మ, చంద్రావతి, అనంతలక్ష్మీ, సుజాత, లక్ష్మీ, పద్మ, పాల్గొన్నారు.