Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
విద్యుద్ఘాతానికి గురై ఎద్దు మృతి చెందిన ఘటన వస్రాం తండా పంచాయతీ శివారులోని లాస్య తండాలో చోటు చేసుకుంది. బాధిత రైతు గుగులోతు మంగ్యా కథనం ప్రకారం.. సోమవారం మేతకు వెళ్లిన అతడి ఎద్దు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సమీపంలో మూడు ఓడల ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్కు తగిలి మృతి చెందింది. సుమారు రూ.80 వేలు విలువైన ఎద్దు మృతి చెందిందంటూ రైతు కుటుంబం కన్నీరు మున్నీరైంది. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ను రక్షణ కల్పిస్తూ నిర్మించి పశువుల ప్రాణాలను కాపాడాలని, ఎద్దు మృతి చెందిన నేపథ్యంలో నష్టపోయిన రైతు మంగ్యాకు పరిహారం చెల్లించాలని గ్రామస్తుల డిమాండ్ చేస్తున్నారు.
బాధిత రైతుకు పరిహారం ఇవ్వాలి : జయమాన్సింగ్, సర్పంచ్
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు తగిలి ఎద్దు మృతి చెందిన నేపథ్యంలో బాధిత రైతుకు ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు పరిహారం చెల్లించాలి. ఈ ప్రాంతంలో విద్యుత్ సమస్య ఉందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటి వరకు 8 ఎద్దులు మృతి చెందాయి. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి లైన్ క్లియర్ చేసి మిడిల్ పోల్స్ వేసి ట్రాన్స్ఫార్మర్ను ఎత్తులో పెట్టాలి.