Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నర్సాపూర్‌లో 49 మందికి పాజిటివ్
నవతెలంగాణ-తాడ్వాయి
మండలంలోని నర్సాపూర్ (పీఏ) కంటైన్మెంట్ జోన్లో కరోనా విజృంభిస్తోంది. సోమవారం నాడు 423 మందికి పరీక్ష నిర్వహించగా 49 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రామంలో ఇదివరకే 36 పాజిటివ్ కేసులు ఉండగా కొత్తగా 49 మందికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో జనం బెంబేలెత్తుతున్నారు. మండల అధికారులు కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజల నిర్లక్ష్యం వల్లే కేసులు పెరుగుతున్నాయన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. అలాగే కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించిన నార్లాపూర్‌లో 56 మందికి పరీక్ష చేయగా 6 కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయి.
ప్రజల నిర్లక్ష్యంతోనే..!
ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వల్లే మండలంలో కరోనా పెరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలించినా గ్రామాల్లోని కూడళ్లలో జనసంచారం కనపడుతోంది. లాక్డౌన్ సమయంలోనూ పలువురు సాకులు చెబుతూ గ్రామాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తులు సైతం ఇతరులతో కలిసి తిరుగుతూ పాజిటివ్ కేసుల పెంపునకు కారకులౌతున్నారని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పలుమార్లు హెచ్చరించినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.