Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
18 ఏళ్ళు పైబడిన వారికి జూన్ 21 నుండి ఉచిత వ్యాక్సినేషన్ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని బీజేపీ స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ఇన్చార్జి మాదాసు వెంకటేష్ అన్నారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ పేదవాడికి కేంద్ర ప్రభుత్వ ఫలాలను అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రేషన్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి ఈ ఏడాది నవంబర్ వరకు ఉచిత రేషన్ బియ్యం అందిస్తున్నట్టు తెలిపారు. మండల అధ్యక్షుడు గట్టు క్రిష్ణ, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి భాస్కుల ఆరోగ్యం, బిజెవైయం జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలనుపాక శరత్‌కుమార్, బిజెపి ఎస్సి మోర్చ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, కొలిపాక పరమేశ్, బీజేపీ ఎస్సీ సెల్ మండల కన్వినర్ రడపాక ప్రదీప్, మహిళా మోర్చ మండల ప్రధాన కార్యదర్శి మహేశ్వరి, నాగరాజు, ప్రభాకర్, సతీష్, సారంగపాణి, విక్రమ్, తదితరులు పాల్గొన్నారు..