Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
కరోనా బాధిత కుటుంబాలకు చెందిన నిస్సహాయ స్థితిలో ఉన్న బాలలకు బాలల సంరక్షణ శాఖ అండగా నిలుస్తుందని జిల్లా బాలల సంరక్షణాధికారి జీ.మహేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం నర్స ంపేట, చెన్నారావుపేట, దుగ్గొండి మండలాలకు చెందిన ఏడు కుటుం బాలకు చెందిన బాలలకు 16 రకాల నిత్యవసర సరుకులు, రూ.ఒక వెయ్యి చొప్పున నగదు సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డీసీపీవో మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 18 యేండ్ల లోపు బాల బాలికలు ఉండి కరోనా కారణంగా తమ తల్లి, లేదా తండ్రీ చని పోయిన లేదా తల్లిదండ్రులను కోల్పోయినా వెంటనే తగిన సహాయాన్ని అందజేస్తామన్నారు. జిల్లాలలో ఇలాంటి కుటుంబాలకు చెందిన బాలల సమాచారాన్ని అందించినట్లయితే జిల్లా కలెక్టర్కు నివేదించి తగు విధంగా సహాయపడుతామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 30 కుటుంబాల నుంచి 47 మంది బాలలను గుర్తించామన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ కే.మంజుల, ప్రొటెక్షన్ అధికారి డీ.రాజు, అవుట్ టీచ్ వర్కర్ సుమన్, బోజర్వు పుల్లయ్య బోడు సర్పంచ్ రమేష్, విజయ, సమ్మునాయక్, తిమ్మంపేట సర్పంచ్ మోడెం విద్యాసాగర్, అంగన్వాడీ టీచర్లు నల్లా భారతీ, శీరిష, అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.