Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ జిల్లా నాయకులు బుర్ర రమేష్
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ, విద్యా రంగం, వ్యవసాయం బాగుపడితే పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు అభివద్ధి చెందుతారని, ఈ రంగాలపై స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రత్యేక దష్టి సారించారని టీఆర్ఎస్ జిల్లా నాయకులు బుర్ర రమేష్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తూ... జిల్లా కేంద్రంలో 100 పడకల ఆస్పత్రిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో చర్చిస్తూ కరోనా కాలంలో 30 పడకల ఆక్సిజన్ బెడ్స్ ప్రారంభించారన్నారు. ప్రసవ కేంద్రం ప్రత్యేక వార్డులు కేటాయించారని అన్నారు. వరంగల్ పర్యటనలో 100 పడకల ఆసుపత్రి గురించి సీఎం దృష్టికి తీసుకుపోగా అప్పటికప్పుడు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారని, జిల్లా మంత్రి కలెక్టర్ చొరవతో త్వరలోనే ప్రారంభమవుతుందని అన్నారు. సింగరేణి కార్మికులకు స్ఎండీతో మాట్లాడి మూడు కోట్లతో ఆక్సిజన్ ప్లాంట్ పెట్టించారన్నారు. గతంలో ఆజంనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పక్కా భవనం నిర్మించి ప్రారంభించారని అన్నారు. చిట్యాలలో కూడా ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. నియోజకవర్గంలో కరోనా వ్యాక్సినేషన్ పగడ్బందీగా జరుగుతోందన్నారు. ఎస్సీ,ఎస్టీ,బిసి హాస్టల్స్, గురుకులాలు, మోడల్ స్కూల్స్, జూనియర్, డిగ్రీ పీజీ కళాశాలలు శాశ్వత భవనాలతో నెలకొల్పిన మహానుభావుడు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో దేవాదుల ప్రాజెక్టు ద్వారా బీమా ఘనపూర్, గొల్ల బుద్ధారం చెరువు, ఘనపూర్ పెద్ద చెరువు, ఎప్పుడూ నిండుకుండలా ఉంటున్నాయన్నారు. రామప్ప ద్వారా గణపురం, మొరంచ పారివాహక ప్రాంతం వ్యవసాయంలో అభివద్ధి చెందిందని అన్నారు. చెక్ డ్యాములు కట్టించి వ్యవసాయ రంగ అభివద్ధికి కషి చేసిన రైతు బాంధవుడు వెంకటరమణ రెడ్డి అని అన్నారు. ఆయనవెంట భక్తాంజనేయ ఆలయ చైర్మెన్ గడ్డం కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కటకం జనార్దన్, టీబీజీకేఎస్ నాయకులు తుమ్మటి రాగోతం రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు ఇమ్రాన్, టీఆర్ఎస్ యూత్ నాయ కులు ముత్తు, ప్రేమ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.