Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
విద్యుద్ఘాతంతో పాడి గేదె మత్యువాతపడిన సంఘటన మండలంలోని అందుకుతండా గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. అందుకుతండాలో రైతు కుంట నరోత్తంకు చెందిన గేద మేతకు వెళ్లిన క్రమంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మత్యువాతపడింది. గేదె విలువ రూ.50వేలు ఉంటుందని రైతు తెలిపారు. ఇటీవల పశువులు విద్యుద్ఘాతంతో మతి చెందుతున్నాయని, మండలంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో పశువులు మత్యువాత పడుతున్నాయని రైతులు ఆరోపించారు. విద్యుత్ తీగలు గ్రామాల్లో కిందికి వేలాడు తున్నాయని, ట్రాన్స్ఫార్మర్లు సరిగా అమర్చకపోవడంతో మేతకు వెళ్ళిన మూగజీవులు విద్యుద్ఘాతానికి గురవుతున్నా యని వాపోయారు. అయినా అధికారులు విద్యుత్ మర మ్మతులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు.