Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్ జిల్లా కేంద్రంలోని 353 జాతీయ రహదారి గుంతలమయమై కాలువలను తలపిస్తోందని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం గుంతలో పడుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సమితి సభ్యులు క్యాతరాజు సతీష్ మాట్లాడుతూ కాళేశ్వరం నుండి మొదలైన ఈ జాతీయ రహదారి గుంతలమయంగా మారిం దని, నిత్యం ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతు న్నారని అన్నారు. అధికారులు స్పందించకపోవడం దురద ష్టకరమన్నారు. ప్రజాప్రతినిధులు. అధికారులు ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తున్నా సమస్య కనిపించకపోవడం సిగ్గుచేటన్నారు. సదరు కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేపట్టడం వల్లే రోడ్డు గుంతలమయమైందన్నారు. వెంటనే మరమ్మతులు చేయించకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మార్త రంజిత్ కోటిలింగం, అమతయ్య కరుణాకర్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.