Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెగ్యూలర్ ఎంపీడీఓ డిప్యూటేషన్ పై బదిలీ
నవతెలంగాణ-గణపురం
ఎంపీడీఓ పోస్టుల్లో రాజకీయరంగు అలుముకుంది. రెగ్యులర్ ఎంపీడీఓను బలవంతంగా జాయినింగ్ రీపోర్ట్ ఇచ్చి డిప్యూటేషన్‌పై వేరే చోటుకు బదిలీ చేశారు. ఇదిమండలంలో చర్చానీయంశంగా మారింది. ఇన్చార్జి ఎంపీడీఓతో కిందిస్థాయి సిబ్బంది నరకయాతన పడుతు న్నట్టు తెలిసింది. ఈ సంఘటన గణపురంలో చోటు చేసుకుంది. గణపురం ఇన్చార్జి ఎంపీడీఓగా, సూప రింటెండ్గా విధులు నిర్వహిస్తున్న నర్సింగరావుకు బాధ్యతలు అప్పగించారు. అయన ఎంపీడీఓగా కొనసా గుతున్న క్రమంలో రెగొండ ఎంపీడీఓగా పని చేస్తున్న అరుంథతికి ఇన్చార్జి ఎంపీడీఓగా గణపురానికి పంపించారు. ఆమె విధులు నిర్వహిస్తుండగా వరంగల్ అర్బన్ డీఅర్డీఓలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న వి కృష్ణవేణిని డిసెంబర్ 31న గణపురం రెగ్యూలర్ ఎంపీడీఓగా బదిలీ చేశారు. దీంతో కృష్ణవేణి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి సెలవు పెట్టింది. అనంతరం జనవరి 12న మళ్లీ విధుల్లోకి చేరింది. విధుల్లో చేరిన మరుక్షణమే ఆమెను మహదేవ్పూర్ ఇన్చార్జి ఎంపీడీఓగా వెళ్ళాలని ఆర్డర్ కాపి వచ్చింది. దీంతో ఆమె మహదేవ్పూర్ కు వెళ్లింది. అక్కడపనిచేస్తున్న రెగ్యూలర్ ఎంపీడీఓ సురేందర్‌ను రెగొండ ఇన్చార్జి ఎంపీడీఓగా పంపించారు. ముగ్గురు ఎంపీడీఓలకు రెగ్యులర్ మండలాల్లో పోస్టింగులు ఉన్నా వారిని ఇన్చార్జిలుగా వేరే మండలాలకు పంపించడం పై అనుమానాలకు తావిస్తోంది. గణపురం ఇన్చార్జి ఎంపీడీఓ అరుంథతితో కిందిస్ఠాయి సిబ్బంది నరకయాతన పడుతున్నట్టు పలువురు పేర్కొంటున్నారు. సెలవుల విషయాల్లో ఇబ్బందులకు గురి చేస్తున్నది. ప్రతి పని కి సంతకం పెట్టాలంటే కొంత ముట్టజెప్పాల్సి వస్తుందని తోటి ఉద్యోగులు పేర్కొంటున్నారు. రెగోండలో పని చేసినపుడు కూడా ఉపాధిహామీ ఏపీఓ, ఎంపీడీఓకు గొడవలు జరిగి రోడుకెక్కారని, అయినప్పటికీ మార్పు లేదని తోటి ఉద్యోగులు వాపోవడం గమనార్హం.