Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సీఐటీయూ ఆధ్వర్యంలో వినూత్న నిరసన
నవతెలంగాణ-భూపాలపల్లి
దేశంలో బీజేపీ అధికారంలోకొచ్చిన నాటి నుంచి రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ట్రాన్స్పోర్ట్ కార్మికులు, ప్రజలపై ధరల భారం మోపుతున్నారని, ధరలు తగ్గించి వారిని ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కంపేటీ రాజయ్య, బొట్ల చక్రపాణి, డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో టాటా మ్యాజిక్ కు తాడు కట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కరోనా నేపథ్యంలో ప్రజలు, కార్మికులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని, మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారన్నారు. పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. ట్రాన్స్పోర్ట్ లో పనిచేస్తున్న ఆటో, టాటా మ్యాజిక్, కారు, డీసీఎం, లారీ తదితర కార్మికులు కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయా రని అన్నారు. వారివీరి కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని వాపోయారు. కేరళ ప్రభుత్వ తరహాలో ప్రతి కార్మికుడికి రూ.7వేలు ఇవ్వాలని, వెహికల్ టాక్స్‌లు, ఫిట్నెస్ చార్జీలు, రోడ్ టాక్స్‌లు ఈ సంవత్సరం మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఫైనాన్స్‌లో వాహనాలు తెచ్చుకున్న కార్మికులకు ఒక్క సంవత్సరం పాటు కిస్తీలు వసూలు చేయాకుండా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు తక్షణమే వారి సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు వంగల రామస్వామి, ఆటో యునియన్ నాయకులు సురేష్, రాజయ్య, వెంకటేశు, సుధాకర్, రమేష్ పాల్గొన్నారు.