Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 వేల ఎకరాలకు సాగునీరు
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
- భీం ఘనపూర్ చెరువు, పంప్‌హౌస్ పరిశీలన
నవతెలంగాణ-భూపాలపల్లి
'దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం.' అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం ఇరిగేషన్ అధికారులు, భూపాల పల్లి నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో కలిసి భూపాలపల్లి మండలం, గొల్ల బుద్ధారం గ్రామంలోని భీమ్ గణపురం చెరువు, పంప్‌హౌస్‌లను ఆయన పరిశీలించి మాట్లాడారు. భీం ఘనపూర్ చెరువు నుండి భూపాలపల్లి మండలం లోని చాలా గ్రామాలకు లిఫ్ట్ ఇరిగే షన్ ద్వారా నీరందించేందుకు రూ.30కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించినట్టు తెలిపారు. కరోనా కారణంగా పనుల్లో జాప్యం నెలకొంద న్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో సమీక్షించి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. ఈ స్కీం పూర్తైతే అటవీ ప్రాంతంలోని దాదాపు 20 వేల ఎకరాలకు సాగునీరు చెరువులు, కుంటల ద్వారా అందుతుందన్నారు. మరో 5 వేల ఎకరాలకు సాగునీరందే విధంగా చర్యలు తీసుకుంటు న్నామని అన్నారు. అనంతరం చికెన్‌పల్లి గ్రామ నాయకుడు కాసం వెంకటరెడ్డి లంగ్ క్యాన్సర్‌తో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ కొత్త హరిబాబు, ఎంపీపీ లావణ్యసాగర్రెడ్డి, వైస్ చైర్మెన్ సముద్రాల దీపా రాణి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ సంపత్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ రాజేష్ నాయక్, టీఆర్ఎస్ నాయకులు సగం సిద్ధూ, యూత్ ప్రెసిడెంట్ రఘుపతి, పిన్ రెడ్డి రాజిరెడ్డి,పింగిలి రవీందర్ రెడ్డి, సర్పంచ్ మాధవి, ఎంపీటీసీ సమ్మయ్య పాల్గొన్నారు.
పర్యటకప్రాంతంగా అభవృద్ధి చేస్తా...
గణపురం : గణపసముద్రం చెరువును పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర వెంకటర మణారెడ్డి అన్నారు. మంగళవారం ఇరిగేషన్ అధికారలతో కలిసి గణపసముద్రం చెరువుకట్ట, మత్తడిని ఎమ్మెల్యే పరిశీలించి మాట్లాడారు. రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తూంలు మరమ్మతు చేస్తే చివరి ఆయకట్టు రైతులకు నీరందుతుందన్నారు. తూంల లీకేజీలతో నీరు వృథాగా పోతోందన్నారు. గణపసముద్రం చెరువు రీజర్వా యర్‌తో రైతులకు మూడు పంటలకు డోకా లేదన్నారు గణపసముద్రం కట్టను మరమ్మతు చేసి గెస్ట్ హౌజ్ నిర్మించి చేరువులో బోటింగ్, లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసి పర్యాటకులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గెస్ట్ హౌజ్ కోసం కట్ట భాగాన్ని పరిశీలించాలని తహసీిల్ధార్ కృష్ణ చైతన్యను ఆదేశించారు. మూడు మండాలాల్లో 26 వేల ఎకరాల సాగుకు వ్యాప్కో సంస్థ తో పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. 20 చెక్ డ్యాంలు నిర్మించి రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపుతామన్నారు. రైతుల అభివృద్ధికి ముఖ్యమంత్రిని కలిసి ఎన్ని కోట్ల రూపాయలైనా మంజూరు చేయించి పనులు చేపిస్తానని హామీనిచ్చారు. సర్పంచ్‌లు నారగాని దేవేందర్, పోట్ల నగేష్, ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్, సొసైటీ చైర్మెన్ పోరెడ్డి పూర్ణచందర్ రెడ్డి, ఈఈ వెంకటరామారావు, డీఈ మేరీ సుధ, గుర్రం తిరుపతి కరుణాకర్‌రెడ్డి, నారాయణ, జనార్థన్, గంగాధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.