Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీఫ్ విప్ వినయభాస్కర్
నవతెలంగాణ-న్యూశాయంపేట
వరంగల్ అభివద్ధిలో బీఆర్ భగవాన్ దాస్ ముందుచూపు, దార్శ నికతే నేటికి ఆదర్శమని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ అన్నారు. ప్రముఖ కార్మిక నేత, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ బిఆర్ భగ వాన్ దాస్ 91వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హన్మకొండ అశోక జంక్షన్లోని భగవాన్ దాస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ వరంగల్లో సంఘటిత, అసంఘటిత వర్గాల కోసం, పేదల నివాసిత స్థలాలకోసం బిఆర్ ఉద్యమించారని, నగ రంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలను పరిరక్షించి ప్రభుత్వ పరం చేసారన్నారు. నగర అభివద్ధి కోసం పరితపించిన భగవాన్ దాస్ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం, రైల్వే డివిజన్ కోసం మూడు దశాబ్దాల క్రితమే పోరాడారని గుర్తు చేశారు. వరంగల్ సెంట్రల్ జైలును తరలించి ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యం కోసం నాడు భగవాన్ దాస్ చూపిన మార్గంలోనే నేడు సీఎం కేసిఆర్, రాష్ట్ర ప్రభుత్వం హయాంలో వరంగల్ నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి పూనుకుని నిజ రూపం దాల్చిందన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, కుడా చైర్మెన్ మర్రి యాదవ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ అజీజ్ ఖాన్, కార్పోరేటర్లు వేముల శ్రీనివాస్, పోతుల శ్రీమాన్, టీఆర్ఎస్ నాయకులు టి. విద్యాసాగర్, చీకటి ఆనంద్, నలుబోల సతీష్ తదితరులు పాల్గొన్నారు.