Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మెన్ నాగుర్ల వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-పోచమ్మమైదాన్
ప్రభుత్వాలు పరిశోధన కేంద్రాలను ప్రోత్సహిం చాలని రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మెన్, సీడ్ పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ డీలర్స్ వరంగల్ అర్బన్ రూరల్ జిల్లా అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మిర్చి పంటకు కొంత మేరకు తెగుళ్లు వైరస్ సోకకపోవడంతో పాటు మార్కెట్లో అధిక ధర మిర్చి కి ఉండటం వల్ల నేడు రైతులు అధికంగా మిర్చి విత్తనాలు కొనుటకు మొగ్గు చూపుతున్నారన్నారు. పత్తికి పురుగు రావడంతో పెట్టుబడి ఎక్కువై దిగుమతి తక్కువ రావడంతో రైతు లు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి పంటకు అధిక పెట్టుబడి అవుతుందని పత్తి విత్తనాలు నాటడానికి రైతులు అనాసక్తి చూపుతున్నారని తెలిపారు. .ప్రస్తుత పరిస్థితులను బట్టి ఎకరానికి అయిదు నుంచి ఎనిమిది క్వింటా ళ్లు మాత్రమే పత్తి దిగుబడి అవుతుం దన్నారు. పెట్టిన పెట్టు బడి రాక రైతులు పూర్తిగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుం దన్నారు. ప్రభుత్వమే పరిశోధన కేంద్రాలను ఏర్పాటుచేసి నూతనమైన అధిక దిగుబడులనిచ్చే రోగ బారిన పడకుండా ఉండే వంగడాలను పరిశోధకులు కనుక్కునే విధంగా ప్రోత్స హించాలన్నారు. విత్తన పరిశ్రమలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంటూ చౌక ధరలకు రైతులకు లభిస్తాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పరిశోధనా కేంద్రాలను ప్రోత్సహించాలని కోరారు.