Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లకార్డులతో యూత్ కాంగ్రెస్ నిరసన
నవతెలంగాణ-పర్వతగిరి
రోజురోజుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలుమార్లు సామాన్య ప్రజలపై ధరలు అధికంగా పెంచుతూ నడ్డి విరుస్తున్నాయని యూత్ కాంగ్రెస్ వరం గల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు రేపల్లె రంగనాథ్ యూత్ కాంగ్రెస్ వరంగల్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు కందికట్ల అనిల్ మండిపడ్డారు. పర్వతగిరి మండ ల కేంద్రంలో మంగళవారం యూత్ కాంగ్రెస్ వర్ధన్నపేట నియోజకవర్గ అధ్యక్షులు కొమ్ము రమేష్ ఆధ్వర్యంలో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ మరియు నిత్యవసర వస్తువుల ధరలను నిరసిస్తూ అంబేద్కర్ సెంటర్లో ఆటోను తాళ్లతో లాగి, ప్లకార్డులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా అర్బన్ జిల్లా అధ్యక్షుడు రేపల్లె రంగనాథ్, కందికట్ల అనిల్ లు మాట్లాడుతూ రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు ఇష్టానుసారంగా పెరిగిపోతుండటంతో పేద ప్రజలు భయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోధీ ప్రభుత్వంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతు న్నాయని, ఈ విషయం పై ధరలు నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్కు అవి ఏమి పట్టనట్టుగా ఫామ్ హౌజ్ లో కునుకు తీస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి పెంచిన ధరలకు తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నరుకుడు రవీందర్, మాసాని భాస్కర్, యూత్ కాంగ్రెస్ నాయకులు రాకేష్ రెడ్డి, మహేందర్, బొక్కల ప్రమోద్, నీరటి ప్రశాంత్, ఉడుతల కష్ణ, బిర్రు రాజు, భూక్య సురేందర్, రవి, దేవ్, రంజిత్ పాల్గొన్నారు.
నల్లబెల్లి : కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ పెట్రోల్ నిత్యావసర సరుకుల ధర లను తగ్గించాలని ప్లే కార్డులు చూపుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ నిత్యావసర సరుకుల ధరలను తగ్గించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఏఐఎఫ్డీఎస్ నర్సంపేట డివిజన్ కార్యదర్శి మార్తా నాగరాజు మహేష్, సతీష్, సాంబయ్య పాల్గొన్నారు.