Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖిలా వరంగల్
కరోనా నుంచి రక్షణ కోసం ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని 42వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. మంగళవారం ఉర్సు లోని కుమ్మరి సంఘం లో ప్రజల సౌకర్యార్థం ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. రంగ సాయి పేట పి హెచ్ సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగరాజు అడగగానే ఈ ప్రాంతంలో కరోనా పరీక్షలు నిర్వహించడం పట్ల కతజ్ఞతలు తెలిపారు. మొత్తం 45 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం భాగ్యలక్ష్మి, ఆశా కార్యకర్తలు అనిత, సుమిత్ర, స్థానిక నాయకులు ఆవునూరి రామన్న, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.