Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
నెక్కొండ మండలంలోని విత్తన విక్రయ దుకణాల్లో మంగళవారం టాస్క్‌ఫోర్స్ బృందం అధికారులు ఆకస్మీక తనిఖీ చేపట్టారు. టాస్క్‌ఫోర్స్ బృం దం అధికారులు ఏడీఏ శ్రీనివాసరావు, సీఐ మధు, ఏఓ సంపత్‌రెడ్డి, ఎస్సై నాగ రాజులు నెక్కొండలోని విత్తన, ఎరువుల దుకాణాలన్నింటిలో రికార్డులు, స్టాక్ బోర్డుల వివరాలు, రశీదు పుస్తకాలను తనిఖీ చేశారు. దుకాణ వ్యాపారుల లైసెన్స్, స్టాకు రిజిష్టరు, స్టాక్ బోర్డులను పరిశీలించి అప్డేట్ రోజువారిగా చేపట్టాలన్నారు. దుకాణాల్లో విత్తనాల అమ్మకం, నిల్వలు, అను మతించిన విత్తనాల కంపెనీల వివరాలను పరిశీలించారు.అలాగే దుకాణాల్లో విడి పత్తి విత్తనాలను విక్రయించరాదని, ఆమోదంలేని విత్తన ప్యాకెట్లను అమ్మరాదని వ్యాపారులకు సూచించారు. బిల్లులపై తప్పనిసరిగా రైతు సంతకం తీసుకోవాలని, రైతు బిల్లులను ఏడాదిపాటు భధ్ర పరచు కోవా లన్నారు. ఈ తనిఖీల్లో అమ్మకం, నిల్వల్లో వ్యత్యాసం, స్టాక్ బోర్డుల అప్డేట్ లేకపోవడంతో మన గ్రోమోర్ కేంద్రం, విజరు ఏజెన్సీస్, గోపిక్రిష్ణ ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్స్ దుకాణాలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ విత్తన చట్టం ప్రకా రం చర్యలకై సిఫారసు చేసినట్లు ఏఓ సంపత్‌రెడ్డి తెలిపారు. తనిఖీల్లో ఏఎ స్సై వేణుగోపాల్, ఏఈఓలు వినేకర్, అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.