Authorization
Sun March 23, 2025 01:31:39 pm
- వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేష్
నవతెలంగాణ-వర్ధన్నపేట
అనుమతులు లేని ఎరువులను, రసాయన మందులను అమ్మ కూడదని అలా విక్రయించినట్టు అయితే కఠిన చర్యలు తీసుకుంటామని వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేష్, మండల వ్యవసాయాధికారి రాంనర్సయ్యలు అన్నారు. మంగళవారం మండలంలోని విత్తనాలు, ఎరువుల షాపులను సీఐ విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. మండలంలోనే ప్రతి ఫర్టిలైజర్ షాపులలో నిల్వలను తనిఖీ చేసి స్టాక్ రిజిస్టటర్ లన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుమతులు లేని ఎరువులను విత్తనాలను విక్రయిం చినట్టయితే రైతులు నష్టపోయే అవకాశం ఉన్నందున రైతులు ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో పరిశీలించి కొనుగోలు చేయాలని సూచించారు. నకిలీ విత్తనాల అమ్మకాలకు ఎవరైనా పాల్పడినట్లు అయితే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వంశీకష్ణ, ఏఈఓలు షాప్స్ యజమానులు పాల్గొన్నారు.