Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి
- ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
నవతెలంగాణ-ములుగు
కేంద్ర ప్రభుత్వం 18 ఏండ్లు నిండిన అందరికీ ఈనెల 21 నుంచి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించనుందని బీజేపీ జిల్లా అద్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఎదుట ప్రధాని మోడీ చిత్రపటానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడారు. 18 ఏండ్లు నిండిన అందరికీ రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతోనే కరోనా వ్యాక్సిన్ అందించడానికి ప్రధాని మోడీ నిర్ణయించడం అభినందనీయమని తెలిపారు. ప్రజల పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, జిల్లా కార్యదర్శి శీలమంతుల రవీంద్రచారి, దొంతిరెడ్డి రవిరెడ్డి, మండల అధ్యక్షుడు ఇమ్మడి రాకేష్ యాదవ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు జినుకల కష్ణాకర్, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దొంతిరెడ్డి రాకేష్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అజ్మీరా కిశోర్, దళిత మోర్చా మండల అధ్యక్షుడు మేకల రవి, కట్టసాయి, తదితరులు పాల్గొన్నారు.