Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పౌష్టికాహారంతోపాటు వైద్యం, వసతి
- మండల కేంద్రంలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు
- తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ సత్య ఆంజనేయ ప్రసాద్
నవతెలంగాణ-తాడ్వాయి
కరోనా బాధితులు త్వరగా కోలుకోవాలని తహసీల్దార్ ముల్కనూర్ శ్రీనివాస్, ఎంపీడీఓ సత్య ఆంజనేయ ప్రసాద్ ఆకాంక్షించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 100 పడకలతో ఐసోలేషన్ కేంద్రాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ సత్య ఆంజనేయ ప్రసాద్ మాట్లాడారు. మండలంలోని కోవిడ్ బాధితుల కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐసోలేషన్ సెంటర్లో కరోనా బాధితులకు పౌష్టికాహారం అందించడంతోపాటు వైద్యులు, సిబ్బంది ఎప్పకటిప్పుడు పర్యవేక్షిస్తారని చెప్పారు. మహిళలు, పురుషుల కోసం వేర్వేరుగా వసతులు కల్పించినట్టు తెలిపారు. తొలిరోజే 63 మంది చేరినట్లు వివరించారు. ఐసోలేషన్ కేంద్రాన్ని రెవెన్యూ, పంచాయతీ రాజ్, వైద్య శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని చెప్పారు. కరోనా బాధితులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వీఆర్వోలు తాడెం వీరస్వామి, నర్సింహస్వామి, సీనియర్ అసిస్టెంట్ రెహ్మాన్, పంచాయతీ కార్యదర్శి యాకలక్ష్మీ, కారోబార్ బుచ్చిబాబు, ఏఎన్ఎం రాజేశ్వరి, ఆశావర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.