Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎఫ్ఓగా ఉద్యోగోన్నతి పట్ల సన్మానం
నవతెలంగాణ-ములుగు
జిల్లాలో అడవుల, వన్యప్రాణుల అభివద్ధికి ఎఫ్డీఓ నిఖిత ఎనలేని కషి చేశారని ములుగు డీఎఫ్ఓ ప్రదీప్‌కుమార్‌శెట్టి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా అడవులకు పూర్వవైభవం తీసుకురావడానికి నిఖిత క్రియాశీలకంగా పాటు పడ్డారని చెప్పారు. కామారెడ్డి డీఎఫ్ఓగా ఉద్యోగోన్నతి పొందిన సందర్భంగా జిల్లా ఎఫ్డీఓ కార్యాలయంలో అటవీ శాఖ అధికారులు నిఖితను మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ ప్రదీప్‌కుమార్ శెట్టి మాట్లాడారు. ములుగు డివిజన్ పరిధిలోని అడవుల అభివృద్ధికి నిఖిత ఎనలేని కషి చేశారని తెలిపారు. వన్యప్రాణులు గణనీయంగా వద్ధి చెందడంలో ఆమె కృషి మరువలేనిదని చెప్పారు. నిఖిత మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తాడ్వాయి ఎఫ్డీఓ ఆశీష్సింగ్, ములుగు ఎఫ్ఆర్ఓలు సృజన, (మొబైల్ పార్టీ) రామ్మోహన్, లింగాల ఎఫ్ఆర్వో సతీష్, తాడ్వాయి ఎఫ్ఆర్వో (టెరిటోరియల్) సత్తయ్య, మంగపేట ఎఫ్ఆర్ఓ షకీల్ పాషా, మేడారం ఎఫ్ఆర్వో గౌతమ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.