Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీడబ్ల్యూసీ చైర్పర్సన్ డాక్టర్ నాగవాణి
- 'శ్రీవాణి' సొసైటీ ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ
నవతెలంగాణ-తొర్రూరు
తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలలకు అండగా ఉంటామని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ డాక్టర్ నాగవాణి తెలిపారు. ఐసీడీఎస్ క్లస్టర్ పరిధిలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు తొర్రూరు అంగన్వాడీ సెంటర్ వద్ద శ్రీవాణి ఎడ్యుకేషనల్, సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ ఇంజమూరి రేణుక సహకారంతో మంగళవారం నిత్యావసర సరుకులు, పౌష్టికాహారం, సరు కులతో కూడిన కిట్లను నాగవాణి పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. తల్లితండ్రులు లేని పిల్లల పోషణ, విద్యా సంబంధిత అవసరాలు, ప్రభుత్వం నుంచి అందాల్సిన రాయితీలు త్వరలోనే ఇప్పిస్తామన్నారు. అనాథ చిన్నారులు ఏ సమస్య ఉన్నా 040-23733665కు లేదా 1098 ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ఆర్థికసాయం అందించిన రేణుకకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు సుంకరనేని పినాకపాణి, సురేష్, అంగన్వాడీ టీచర్లు ప్రమీల, లలిత, మనోధర, ఆయా సుభద్ర, చిన్నారులు పాల్గొన్నారు.