Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమలాపూర్‌లో ఘనస్వాగతం పలికిన శ్రేణులు ఈటెల అనుచరుల్లో ఉత్సాహం పల్లాపై ఘాటు విమర్శలు
నవతెలంగాణ-వరంగల్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించాక మంగళవారం ఆయన తన సొంత మండలం కమలాపూర్‌కు మొదటిసారి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు ఘనస్వాగతం పలికారు. సొంత మండలంలో ఈటల ఒంటరిని చేశామని భావించిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం మంగళవారం ఈటలకు లభించిన ఘనస్వాగతంతో ఖంగుతింది. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఆయన అనుచరులు నినాదాలు చేశారు. 'ఈటల' నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున ఆయన అనుచరులు రావడం ఆసక్తికరంగా మారింది. గత 20 రోజులుగా టీఆర్ఎస్ మంత్రులు, నేతలు కమలాపూర్ మండలంలోని టిఆర్ఎస్ కేడ ర్ను, ప్రజాప్రతినిధులను పిలుచుకొని టిఆర్ఎస్లోనే కొనసాగనున్నట్లు ప్రకటనలు చేయించారు. అందులో పలువురు నేతలు తిరిగి 'ఈటల'కు మద్దతు ప్రకటించడం గమనార్హం. 'ఈటల' చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్సీ పల్లాపై 'ఈటల' చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టిఆర్ఎస్కు రాజీ నామా చేసిన అనంతరం మంగళవారం మొదటిసారి తన సొంత మండలం కమలాపూర్‌కు విచ్చేశారు. శామీర్‌పేట ఈటల స్వగృహం నుంచి కార్ల కాన్వారుతో బయలుదేరి కమలాపూర్‌కు రాగానే బైక్ ర్యాలీ ప్రారం భమైంది. పెద్ద సంఖ్యలో తన అనుచరులతో ఆయన మండలంలోని కనపర్తి, కమలాపూర్ గ్రామాల్లో పర్యటించారు. మహిళలు నీరాజనాలు పలికారు. దీంతో కమలాపూర్ మండలంలో ఈటల పర్యటన చర్చనీయాంశంగా మారింది.
'పల్లా'పై ఘాటుగా స్పందించిన 'ఈటల'
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై 'ఈ టల' తీవ్రంగా స్పందించారు. ఉద్యమ ద్రోహులు ఎవరో, ఉద్యమకారులు ఎవరో తెలం గాణ ప్రజలకు తెలుసని, ఎవరెప్పుడు పార్టీలోకి వచ్చారో, ఎవరి చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసన్నారు. అటువంటి నేతల గురిం చి మాట్లాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈట ల బర్తరఫ్ అనంతరం 'పల్లా' చేసిన విమర్శలపై తీవ్ర ంగా స్పందించారు. ప్రగతి భవన్ ఇచ్చిన స్క్రిప్ట్ చదివే వారి గురించి వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదన్నారు.
ఎన్నికల ప్రచారం షురూ..
టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం కమలాపూర్ మండలంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్‌కు ప్రజలు బుద్ది చెబుతారని ప్రకటించారు. గత ఆరు ఎన్నికలలో నన్ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని, ఈసారి జరగబోయే ఎన్నికల్లో హుజురాబాద్ ప్రజలు అమ్ముడుపోరని నిరూపించుకోవాల్సిన అవస రముందన్నారు. తన అనుచరులను బ్లాక్మెయిల్ చేస్తున్నారని, బెదిరిస్తున్నారని ఆరోపించారు. గొర్రెల మందపై తోడేళ్లు పడ్డట్టు నా అనుచరులపై దాడులకు పాల్ప డుతున్నారన్నారు. 19 ఏండ్లుగా ఉద్యమంలో పనిచేసిన నీకు అన్యాయం జరిగిందని, తెలంగాణ ద్రో హులను పక్కన పెట్టుకొని తెలంగాణ ఉద్యమకారులకు ద్రోహం చేయడం సీఎం కేసీఆర్‌కు తగదని అంటున్నారని 'ఈటల' చెప్పారు. రేపు సంగ్రామం జరిగితే కురుక్షేత్రం లాగానే జరుగుతదని, అధర్మాన్ని ఓడించి, ధర్మాన్ని గెలిపించాలన్నారు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో విద్యా ర్థులు, కార్మికులు, హక్కుల కోసం ఉద్యమించిన వారం తా హుజురాబాద్‌కు వచ్చి నాకు మద్దతు పలికారన్నారు. 'మీ కాళ్లకు మొక్కుతా, మీకు నచ్చిన బిడ్డగా మీ ఆత్మ గౌరవాన్ని నిలబెడుతానని, ఈ ఎన్నికల్లో అఖండవిజయం అందివ్వాలని' కోరారు.
'ఈటల' అనుచరుల్లో ఉత్సాహం
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన సొంత మండలం కమలాపూర్‌లో పర్యటించడంతో ఆయన అనుచరుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఉప ఎన్నికలో లక్ష మెజార్టీతో గెలిపిస్తామంటూ నినాదాలు చేశారు. మండలకేంద్రంలో 'ఈటల'కు పెద్ద సంఖ్యలో అనచరులు స్వాగతం పలకడం చర్చకు దారితీసింది. కమలాపూర్ మండలంలో 'ఈటల' ఒంటరయ్యాడని భావించిన టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఈటలకు లభించిన ఘనస్వాగతం చూసి ఖంగుతింది.
టీఆర్ఎస్కు షాక్..
సొంత మండలం కమలాపూర్‌లో ఈటల'ను ఒంటరి చేశామని భావించిన టీఆర్ఎస్ అగ్రనాయకత్వం మంగళవారం ఈటలకు లభించిన ఘనస్వాగతం చూసి ఖంగుతింది. టీఆర్ఎస్కు చెందిన మండల ప్రజాప్రతినిధులు పలువురు మంత్రి హరీష్‌రావు వద్ద టీఆర్ఎస్లోనే కొనసాగనున్నట్లు ప్రకటించినా, వారు తిరిగి 'ఈటల' గూటికే చేరారు. దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో అనుక్షణం రాజకీయ సమీ కరణలు మారుతుండడం ఆసక్తికరంగా మారింది. మంత్రి హరీష్‌రావు, మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ రంగంలోకి దిగి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, కేడర్ పార్టీలోనే కొనసాగేట్టు గత 20 రోజులుగా చేసిన కసరత్తుకు చీలికలు తప్పడం లేదు. ఏ నేత ఎప్పుడు ఎటు వైపు వెళ్తాడో, తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు, కప్పదాట్లు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.