Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎరువులు, పురుగు మందుల షాపుల్లో తనిఖీ
నవతెలంగాణ-గూడూరు
కల్తీ గడువు దాటిన విత్తనాలను విక్రయించొద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (డీఏఓ) ఛత్రునాయక్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలోనిహరి ఆగ్రో ఏజెన్సీస్, శ్రీ శ్రీనివాస ఫెర్టిలైజర్స్ ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్స్ షాపులను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ-పాస్ మిషన్‌లోని ఎరువుల, గ్రౌండ్ స్టాక్ వివరాలను పరిశీలించారు. షాపుల్లోని విత్తనాలను పూర్తిగా తనిఖీ చేసి నాణ్యమైనవని నిర్ధారించారు. ఈ సందర్భంగా ఛత్రునాయక్ మాట్లాడారు. రైతులు విత్తనాలు కొంటే బిల్లు తీసుకోవాలని స్పష్టం చేశారు. షాపు యజమానులు రైతులకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలున్నారు. నాణ్యమైన, మంచి కంపెనీలకు చెందిన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని చెప్పారు. డీలర్లు విత్తన చట్టానికి లోబడి వ్యాపారం చేయాలని సూచించారు. విత్తన చట్టాన్ని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అల్లె రాకేష్ పాల్గొన్నారు.