Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణాభివృద్ధికి తపించిన మహోన్నతుడు
- మున్సిపల్ చైర్మెన్ రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు
నవతెలంగాణ-తొర్రూరు
ఏడో వార్డు కౌన్సిలర్ మాడ్గుల నట్వర్‌ను చిరస్మరణీయుడిగా మున్సిపల్ చైర్మెన్ రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు అభివర్ణించారు. పట్టణాభివృద్ధికి తపిరచిన మహోన్నతుడిగా కీర్తించారు. నట్వర్ మతికి సంతాపంగా డివిజన్ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు. కౌన్సిలర్ మృతికి సంతాపం తెలిపి ఆయన సేవలను స్మరించారు. అనంతరం చైర్మెన్ రామచంద్రయ్య, కమిషనర్ బాబు మాట్లాడారు. పట్టణ అభివద్ధిలో నట్వర్ క్రియాశీలకంగా పని చేశాడని చెప్పారు. పురపాలికకు మణి మకుటంగా నిలిచిన యతిరాజారావు పార్కును అందంగా తీర్చిదిద్దడంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాడని కొనియాడారు. పేదల సంక్షేమం కోసం తపించే వాడని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పేదల వెంట నిలిచే వాడని చెప్పారు. మాజీ మంత్రి యతిరాజారావు దగ్గర రాజకీయ ఓనమాలు దిద్ది అనతికాలంలోనే ప్రజాభిమానం కలిగిన నేతగా ఎదిగాడని తెలిపారు. ఎన్టీఆర్ ప్రభంజనంలో టీడీపీలో, తదనంతరం టీఆర్ఎస్లో నిస్వార్ధంగా పని చేశాడని వివరించారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచనల మేరకు పట్టణ అభివద్ధికి అంకితభావంతో పని చేశాడని తెలిపారు. ఎంపీటీసీగా, వార్డు సభ్యుడిగా, కౌన్సిలర్‌గా చిత్తశుద్ధితో పని చేసి పదవులకు వన్నె తెచ్చాడని కొనియాడారు. నట్వర్ మతి పట్టణ అభివద్ధికి తీరని విఘాతమన్నారు. ఏడో వార్డులో నిలిచిపయిన పనులను పూర్తి చేసి నట్వర్ ఆశించిన ప్రగతికి బాటలు వేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైస్ చైర్మెన్ జినుగ సురేందర్‌రెడ్డి, మేనేజర్ శ్రీనివాస స్వామి, కౌన్సిలర్లు భూసాని రాము, తూనం రోజా, పేర్ల యమున, ధరావత్ సునీత, నరుకుటి గజానంద్, దొంగరి రేవతి, నాగజ్యోతి, గుగులోత్ శంకర్, శ్రీనివాసరావు, కొలుపుల శంకర్, నాయకులు దొంగరి శంకర్, నాగరాజు, జైసింగ్, మణి రాజు, జంప్ప, జూనియర్ అసిస్టెంట్ కట్ట స్వామి, శానిటరీ ఇన్స్పెక్టర్ కొమ్ము దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.