Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని టీఆర్ఎస్ పార్టీ పెద్దవంగర మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య తెలిపారు. ఆ మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో పెద్దవంగర, చిట్యాల, పోచంపల్లి గ్రామాలకు చెందిన లబ్దిదారులకు గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సహకారంతో పలువురికి సీఎం సహాయ నిధి నుంచి సాయం అందించినట్టు తెలిపారు. కార్యక్రమంలో పాలకుర్తి దేవస్థాన చైర్మెన్ రామచంద్రయ్య శర్మ, పార్టీ మండల నాయకులు సుధగాని మనోహర్, బానోతు వెంకన్న, గ్రామ కమిటీ అధ్యక్షుడు బోనగిరి లింగమూర్తి, ఎస్ఎంసీ చైర్మెన్ సుంకర అంజయ్య, నాయకులు కుందూరు వెంకన్న, పెద్దవంగర మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు ముద్దసాని అశోక్, తదితరులు పాల్గొన్నారు.