Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ
- కమిషన్ సభ్యురాలు శోభారాణి
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
కోవిడ్‌తో బాధపడుతున్న చిన్నారుల కుటుంబాలకు చేయూతనిస్తామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు శోభారాణి అన్నారు. గురువారం మండలంలోని మొట్లపల్లి, మెట్టుపల్లి గ్రామాల్లో కోవిడ్‌తో బాధపడుతున్న చిన్నారుల కుటుంబాలకు బాలల సంక్షేమ సమితి చైర్మన్ దాస్యం వేణుగోపాల్, జిల్లా సంక్షేమాధికారి శ్రీదేవితో కలిసి పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్ల ద్వారా జిల్లా బాలల పరిరక్షణ విభాగానికి వచ్చిన సమాచారం మేరకు ఆయా గ్రామాల్లో కరోనా బారిన పడిన పిల్లల కుటుంబాలకు పౌష్టికాహార కిట్లను అందించామన్నారు. కరోనా బారిన పడిన పిల్లల, కరోనా బారిన పడిన తల్లిదండ్రుల పిల్లల రక్షణ, సంరక్షణ నిమిత్తం జిల్లాలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, కోవిడ్ భాదితులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు విధిగా మాస్క్ ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని, మంచి పౌష్టికాహారం తీసుకొని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించు కోవాలని కోరారు. అనంతరం జిల్లా సంక్షేమాధికారి శ్రీదేవి మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా కోవిడ్‌తో బాధపడుతున్న పిల్లలు గానీ లేదా కోవిడ్ తో బాధపడుతున్న తల్లిదండ్రుల యొక్క పిల్లలు గానీ ఎవరైనా ఉంటే 040-23733665 లేదా చైల్డ్ హెల్ప్ లైన్ 1098కు గానీ సమాచారం అందిస్తే వెంటనే వారిని రక్షించే దిశగా తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ కె.శిరీష, సీడీపీవో అవంతి, జిల్లా బాలల సంరక్షణ అధికారి హరిక్రిష్ణ, రాజకొమురయ్య, ఎల్‌సీపీఓ మోహినోద్దీన్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సునీల్, సోషల్ వర్కర్ శైలజ, కౌన్సిలర్ రమ్య,తులసి, అవుట్ రీచ్ వర్కర్ లక్ష్మీ ప్రసన్న, సోషల్ కుమార్, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల : కరోనా బారినపడి మతి చెందిన కుటుంబాల పిల్లలకు అండగా ఉండి, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని స్టేట్ కమిషన్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైడ్ కమిటీ మెంబర్ శోభారాణి అన్నారు. గురువారం మండలంలోని చల్లగరిగ, జూకల్, శాంతినగర్ గ్రామాల్లో జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్మన్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శోభారాణి పాల్గొని ఇటీవల కరోనా బారినపడి మతి చెందిన కుటుంబాలను సందర్శించి బాధిత పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించారు. అనంతరం శోభారాణి మాట్లాడుతూ కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాలకు సంబంధించిన పిల్లలకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మంజుల అశోక్ రెడ్డి పాల్గొన్నారు.