Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీహెచ్సీ వైద్యాధికారి నాగ శశికాంత్
నవతెలంగాణ శాయంపేట
కరోన్షా పాజిటివ్ వ్యక్తులు వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ మనోధైర్యంతో ఉండాలని పి హెచ్ సి వైద్యాధికారి డాక్టర్ నాగ శశికాంత్ అన్నారు. మండలంలోని కాట్రపల్లి, వసంతపూర్ గ్రామాలలో కరోనా పాజిటివ్ నచ్చిన వ్యక్తుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య వివరాలను డాక్టర్ నాగ శశికాంత్ అడిగి తెలుసుకున్నారు. పౌష్టికాహారం తీసుకోవాలని, పాలు, కోడిగుడ్లు, ఆకుకూరలు, మాంసకత్తులు తీసుకోవాలని సూచించారు. హౌమ్ క్వారం టైన్లో ఉంటూ ఇంటి నుండి బయటకు రావద్దని సూచిం చారు. ప్రత్యేక గదులు లేకపోతే ఐసోలేషన్ కేంద్రానికి తరలిస్తామని అన్నారు. కాట్రపల్లి గ్రామంలో కోవిడ్ పాజిటివ్ కేసులు సంఖ్య గణనీయంగా పెరగడంతో గ్రామంలో వారం రోజుల పాటు స్వచ్ఛందంగా లాక్ డౌన్ ప్రకటించు కోవాలని సర్పంచ్ ఒంటేరు వనమ్మ వీరస్వామి కి సూచించారు గ్రామాలలో సోడియం హైపో క్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించి, బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.