Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న యాచకులకు, ప్రయాణీకులకు గురువారం యువ సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వరంగల్ బస్టాండ్ ఏరియాలో బిర్యానీ ప్యాకెట్లు అందించారు. ఈ సందర్భంగా యువ సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు బొమ్మల శంకర్, మండల పరమేష్ మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న వారికి గురువారం వరంగల్ రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాలలో 200 మందికి వెజ్ బిర్యానీ ప్యాకెట్, వాటర్ బాటిల్స్ అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కొల్లూరి రాజారత్నం, చిర్ర రాజు, చింతల రాజు, మేదరి భవాని, గాలి అన్వేష్, ఇమ్మడి సుమన్, వేణు, ప్రవీణ్, సునీల్, శేఖర్, రమేష్, రాజు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.