Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాముత్తారం
మండలంలోని పెగడపల్లి గ్రామంలో కోవిడ్‌తో ఉన్న బాధితుడికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాల్లోకెళితే.... జాటోత్ శ్రీరామ్ నాయక్. మాజీ సర్పంచ్ రెండు వారాల నుండి కోవిడ్‌తో బాధపడుతూ వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు. శ్రీరామ్ ఆరోగ్యం బాగాలేదని విషయం తెలుసుకున్న మిత్రులు, శ్రేయోభిలాషులు ఒక లక్ష రూపాయలు జమ చేసి బాధితుని కుటుంబానికి గురువారం అందజేశారు. ఎవరికి ఆపద వచ్చినా. గ్రామస్తులంతా కలిసి సహాయం అందిస్తామని తీర్మానం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాటోత్ దన్ను నాయక్, డీలర్ బోడ రతన్ సింగ్ , టీచర్ జాటోత్ రాంసింగ్, జాటోత్ జైపాల్, ముక్లోత్ రాజన్న, వావిళ్ళ కిష్టయ్య, రామగిరి దుర్గయ్య పాల్గొన్నారు.