Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్
నవతెలంగాణ-భూపాలపల్లి
7వ విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్ అన్నారు. గురువారం స్థానిక ఇల్లందు క్లబ్ హౌస్ లో జిల్లా గ్రామీ ణాభివద్ధిశాఖ ఆధ్వర్యంలో 7వ విడత తెలంగాణకు హరిత హారం కార్యక్రమం నిర్వహణపై జిల్లా, మండలస్థాయి అధికా రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ... ఆరేండ్లుగా రాష్ట్రంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలను నాటి సంరక్షించడంతో నేడు దేశంలోనే పచ్చదనం స్థాయి పెరుగుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నదని అన్నారు. ఇదే స్థాయిలో ఏడో విడత హరితహారం ద్వారా జిల్లాలో మొక్కలను నాటేందుకు ఇప్పటికే జిల్లాలోని 241 గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో, ఫారెస్ట్, సింగరేణి తదితర సంస్థల ఆధ్వ ర్యంలో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలను వద్ధి చేశామ న్నారు. మొక్కలను నాటుటకు మండలాలు, శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించనట్టు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడగానే నిర్దేశించిన విధంగా 30 లక్షల మొక్కలు నాటేందుకు సమన్వయంతో పనిచేయాలన్నారు. మండల స్థాయిలో ప్రజా ప్రతినిధులు, గ్రామ సర్పంచులు, గ్రామస్థాయి అధికారులతో మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మొక్కలు నాటేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. గతేడాది జిల్లాలో వరదలను దష్టిలో పెట్టుకొని ఈసారి వరద ప్రభా వం జిల్లాలో పడకుండా ముందస్తుగా వరద ప్రాంతాలను గుర్తించి సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. చెరువులకు గండ్లు పడకుండా ముందస్తుగా మరమ్మతులు పూర్తి చేయాలని అన్నారు. అనంతరం డీఆర్డీఓ పురుషోత్తం మాట్లాడుతూ... ఏడో విడత హరితహారం ద్వారా జిల్లాలో గ్రామీణ అభివద్ధి శాఖ తరఫున మండలాల వారీగా భూపాలపల్లి 186720, చిట్యాల 194500, ఘన్పూర్ 132260, కాటారం 186720, మహాదేవపూర్ 140040, మల్హర్ రావు, 116700, మొగుళ్లపల్లి 194500, మహాముత్తారం 186720, పలిమెల 62240, రేగొండ 287860, టేకుమట్ల 186720 మరియు అటవీ శాఖ తరఫున 3 లక్షలు, వ్యవసాయశాఖ 45000, ఎక్సైజ్ 47,000, పోలీస్ శాఖ 160000, విద్యాశాఖ 60000, ఎస్సీ, ఎస్టీ, బిసి సంక్షేమ హాస్టళ్లలో 5000, పీహెచ్సీలలో 6000, సింగరేణి సంస్థ 4 లక్షలు, ఉద్యానవన, పట్టుపరిశ్రమశాఖ 15000, భూపాలపల్లి మున్సిపాలిటీ 1 లక్ష మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. వృక్షాల్ని రక్షించేందుకు చిప్కో ఉద్యమం నడిపి కొద్ది రోజుల క్రితం మరణించిన సుందర్ లాల్ బహుగుణకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీపీఓ ఆశాలత, ఎప్డీఓ వజ్రరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శశిధర్‌రెడ్డి, జిల్లా హార్టికల్చర్ అధికారి అక్బర్, వ్యవసాయశాఖ అధికారి విజరు భాస్కర్, సీపీిఓ శామ్యూల్ డీఆర్డిఓ ప్లాంట్ మేనేజర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
హరిత జయలో మొక్కలు నాటండి
మహాదేవపూర్ : హరిత జయలో అందరూ మొక్కలు నాటాలని ఎస్సై రాజ్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో సీఆర్పీఎఫ్ పోలీస్ 58వ బెటాలియన్ ఆల్ఫా కంపెనీ అసిస్టెంట్ కమాండెంట్ డీఎస్పీ నళిని ఆదేశాల మేరకు గురువారం మొక్కలు నాటారు. సామాజిక సేవలో హరిత గ్రామంగా తీర్చిదిద్దడానికి సహకారమందిస్తున్న సీఆర్పీఎఫ్ బృందం ఎస్సై జయచంద్రన్కు సర్పంచ్ శ్రీపతిబాపు కృతజ్ఞతలు తెలిపారు. బస్టాండ్ ఆవరణలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని కోరారు. ఏఎస్సై రవీందర్ రెడ్డి, బెటాలియన్ సభ్యులు భాగ్యారావు పాల్గొన్నారు.
అందరి భాగస్వామ్యం ముఖ్యం
నెక్కొండ రూరల్ : హరితహారంతోపాటు, నాటిని మొక్కలను సంరక్షించడంలో అందరి భాగస్వామ్యం ముఖ్యమని ప్రముఖ న్యాయవాది రాళ్లబండి లక్ష్మీనారాయణ అన్నారు. నెక్కొండలోని పోచమ్మ దేవాయ ఆవరణలో గురువారం వనప్రేమి నల్లగొండ సమ్మయ్య, విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం వనప్రేమి సమ్మయ్యను విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. సంఘం మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, రాజేశ్, రవిచారి, రాము, పాపయ్య, బ్రహ్మచారి, తదితరులు పాల్గొన్నారు.