Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూశాయంపేట : కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు రూ.7,500 ఇవ్వాలని సీఐటీయూ వరంగల్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల సారంగపాణి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తూన్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ గురువారం హన్మకొండ లోని పబ్లిక్ గార్డెన్స్ , పెట్రోల్ బంక్ వద్ద దేశ వ్యాప్త నిరసనలో భాగంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సారంగపాణి పాల్గొని మాట్లా డుతూ... కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని అన్నారు. కార్మికులను బానిసత్వం లోనికి నెట్టే కార్మిక చట్టాల 4 కోడ్లను రద్దు చేయాలన్నారు. ఆదాయపు పన్ను చెల్లింపు పరిధిలోని ప్రతి కుటుంబానికి ప్రతి నెల రూ.7500 నగదు ఇవ్వాలన్నారు. అసంఘటిత కార్మిక అందరికీ పింఛన్ పథకం కింద రూ.10వేలు ఇవ్వాలన్నారు. విద్య, వైద్య రంగాలకు అధిక నిధులు కేటాయించాలని కోరారు. కరోనా కాలంలో కార్మికులందరికీ వైద్యమందించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంద యాకనారయణ,కోరబోయిన దయానంద్, సురేష్, సతీష్, శ్రీనివాస్, పాల్గొన్నారు
బీజేపీ ప్రభుత్వ పాలనను ఎండగట్టాలి
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తూన్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల సారంగపాణి పిలుపునిచ్చారు. గురువారం హన్మకొండలోని జీవన్ లాల్ కాంప్లెక్స్‌లో షాప్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అంబానీ ఆదాని సేవ లో మునిగిన ప్రధాని మోడీ ప్రజలను కరోనా నుంచి కాపాడానికి ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. ఇప్పటికే దేశంలో లక్షలాదిమంది ప్రాణాలు గాల్లో కలిశాయని అన్నారు. అందరికీ వ్యాక్సిన్ పూర్తయ్యేలోగా మరెన్ని ప్రాణాలు పోవాల్సి వస్తుందోనని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ నేరపూరిత అసమర్థత పాలనను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రజానీకాన్ని ఆదుకోవాల్సిన టీిఆర్‌ఎస్ ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోందన్నారు. లాక్ డౌన్ల పొడిగింపులు తప్ప ఉపాధి కోల్పోయిన కార్మిక కుటుంబాలకు ఎటువంటి ఆర్థిక తోడ్పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని అపాకపనేజ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను, మూడు వ్యవసాయ బిల్లులను, విద్యుత్ బిల్లు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆల్ షాప్ వర్కర్స్ యూనియన్ నాయకులు బి రమేష్, పి అనిల్ యాదవ్, ఆర్ సదానందం, ఎస్ వేణు, జి శివ, నీరజ, మంజుల ,అనిత కారుణ్య. తదితరులు పాల్గొన్నారు
ఖిలా వరంగల్ : కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక దుర్మార్గమైన పాలనను ఎండగట్టాలని సీఐటీయూ వరంగల్ అర్బన్ జిల్లా సహాయ కార్యదర్శి ముక్కుర రామస్వామి పిలుపునిచ్చారు. సీఐటీయూ వరంగల్ అర్బన్ జిల్లా కరీమాబాద్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ తోట జంక్షన్ లో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ పాలనలో దేశంలో ప్రజలు, కార్మికుల జీవితాలు చిన్నా భిన్నమైన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాలు ప్రతి కార్మిక కుటుంబానికి ఆరు నెలల పాటు 10 కిలోల బియ్యం ఇతర వస్తువులతో పాటు నెలకు రూ.7500 ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని, కార్మికులకు పని భద్రత కల్పించాలని, చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. సామల శ్రీధర్, బావు రామస్వామి, యాకయ్య యాదవ్, కంచె మెట్టయ్య, మనోహర్, నీలం శేఖర్, కోటి పాల్గొన్నారు
నయీంనగర్ : మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ హన్మకొండ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు, ఇసుక లోడింగ్ అన్ లోడింగ్ కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు టి ఉప్పలయ్య, హన్మకొండ మండల కార్యదర్శి దామెర సుదర్శన్ పాల్గొని మాట్లాడారు. కేంద్ర మోడీ సర్కార్ కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులకు దోచు పెట్టే విధంగా కార్మిక 4 కోడ్ ల ను,3 రైతు వ్యతిరేక చట్టాలను, విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. వెంటనే కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని అన్నారు. రవీందర్, రాజు రెడ్డి, రమేష్, శంకర్, రవీందర్ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
గణపురం : కరోనా భాదితులను అదుకోవాలని డిమాండ్ చెస్తూ గురువారం సీఐటీయూ మండలకార్యదర్శి చెన్నూరి రమేష్ అద్వర్యంలో నిరసన తెలిపారు. అందరికి ఉచితంగా కరోనా టీకా వేయాలని కోరారు. 3వదశ కరోనా నేపద్యంలో సరిపడా మందులు, బెడ్లు అక్సిజన్ వసతులు ఏర్పాటుచేయాలన్నారు. రవి తదితరులు పాల్గొన్నారు.
కార్మిక కుటుంబాలకు కరోనా టీకాలు ఇవ్వాలి
మొగుళ్ళపల్లి : కేంద్ర ప్రభుత్వం కరోనా టీకాల ఉత్పత్తిని వేగంగా పెంచి కార్మికులకు, కార్మిక కుటుంబాలకు టీకాలు తక్షణమే ఇప్పించాలని సీఐటీయూ మండల కో కన్వీనర్ కె విజరు డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని ఇస్సి పేట గ్రామంలో ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా ప్లకార్డులతో పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. కరోనతో చనిపోయిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ కార్మికుల కు రూ.50 లక్షల ఎక్సేగ్రేషయా ఇవ్వాలని, చనిపోయిన కార్మికుని కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రియాంక, రమ తదితరులు పాల్గొన్నారు.
పర్వతగిరి : సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో పర్వతగిరి మండల కేంద్రంలో గురువారం అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల గౌరవ అధ్యక్షురాలు రుక్మిణి, మండల కన్వీనర్ జిల్లా రమేష్ పాల్గొని మాట్లా డారు. అనంతరం కరోనాతో చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని తహసీల్దార్ ఎస్కె మహబూబ్ అలీ కి వినతి పత్రం అందజేశారు. కేవపీఎస్ మండల కన్వీనర్ పొడిటి దయాకర్, అరుణ దేవి, సుమిత్ర, పాతిమా, భాగ్యలక్ష్మి, శ్రీధర్, రమేష్, కుమార్ పాల్గొన్నారు.