Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్పర్తి
మృతురాలి బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని 55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల వెంకటేశ్వర్లు యాదవ్ అన్నారు. గురువారం 55వ డివిజన్ భీమారం ఎస్సీ కాలనీలో సంగాల శ్రీను భార్య సునీత (40) ఇంటిలో విద్యుద్ఘాతంతో మృతిచెందింది. కార్పొరేటర్ విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారమందించగా మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం భీమారంలో అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సహకారంతో ప్రభుత్వ సహకారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్పొరేటర్ వెంటసంగాల పృథ్విరాజ్, సంగాల విక్టర్ బాబు, సంగాల చిన్న, సంగాల సుమన్ ,గుంజ సాయి కుమార్, సంఘాల దయాకర్, దావీదు, కరుణాకర్, శరత్ పాల్గొన్నారు.