Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
కరోనా నివారణలో వైద్య సిబ్బంది సేవలు మరువలేనివని 55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజితవెంకటేశ్వర్లుయాదవ్ అన్నారు. గురువారం గ్రేటర్ భీమారం జీఎమ్మార్ గార్డెన్స్‌లో బల్ధ్దియా ఆధ్వర్యంలో హసన్‌పర్తి యూపీహెచ్సీ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో నిర్వహిస్తున్న కరోనా టీకా కేంద్రాన్ని, వైద్య సిబ్బందికి భోజన ఏర్పాట్లను కార్పొరేటర్ పరిశీలించారు. క్యూలైన్లో వచ్చే రద్దీని నిలువరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఉమశ్రీ, మెడికల్ ఆఫీసర్ వాణిశ్రీ, వైద్యులు పద్మశ్రీ, రమణశ్రీ, డీటీసీ ట్రీట్మెంట్ ఆర్గనైజర్ ఎస్ రమేష్‌కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.