Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
కరోనా బాధితులకు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులతోపాటు పౌష్టికాహారం అందిస్తూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అండగా నిలుస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు తెలిపారు. డివిజన్ కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పట్టణానికి, మండలంలోని 29 పంచాయతీలకు చెందిన కరోనా బాధితులకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండో విడత సరుకుల పంపిణీ కార్యక్రమం గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా సీతారాములు మాట్లాడారు. కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో చేరి అప్పుల పాలై ఇబ్బంది పడుతున్న కుటుంబాలను ఆదుకునేందుకు మంత్రి దయాకర్‌రావు, ట్రస్ట్ చైర్పర్సన్ ఉష దంపతులు అందిస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు. ఎర్రబెల్లి దంపతుల స్ఫూర్తితో కరోనా బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జెడ్పీటీసీ మంగళపెళ్లి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మెన్ మంగళపల్లి రామచంద్రయ్య, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రామిని శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, నాయకులు జైసింగ్, ఎన్నమనేని శ్రీనివాస్, రాయిశెట్టి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.