Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
గ్రామ పంచాయతీల్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేయా లని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ మం డల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి అధ్యక్షతన గురు వారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, జయరాం రెడ్డి మాట్లాడారు. పంచాయతీలో ప్రజాధనం దుర్వి నియోగం అయ్యిందని తెలిపారు. పలువురు పంచా యతీ కార్యదర్శులు కాంట్రాక్టర్ల అవతారమెత్తి బినామీ పేర్లతో వీడీసీలు పొంది గ్రామాల్లో అభివృద్ధి పనుల పేరుతో లక్షలు దండుకున్నారని ఆరోపిం చారు. అవినీతిపై విచారణ జరిపి నిధులను రికవరీ చెయ్యాలని డిమాండ్ చేశారు. మండలంలోని గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌లు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు, అధికార పార్టీలోని కొందరు నాయకులు కుమ్మక్కై సభలు నిర్వహించ కుండా దొంగ తీర్మానాలు చేసి ప్రజాధనాన్ని కాజేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి కి పాల్పడ్డ కార్యదర్శులపై కాంగ్రెస్ పార్టీ పలుమార్లు జిల్లా, మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసి నట్టు తెలిపారు. అవినీతికి పాల్పడ్డ పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే సీతక్క సైతం డిమాండ్ చేశారని గుర్తు చేశారు. అవినీతికి పాల్పడ్డ కార్యదర్శులను అధికార పార్టీ నాయకులు కాపాడే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమన్నారు. కమలాపురంలో రద్దయిన వీడీసీ కమిటీ పేరుతో గ్రామసభ తీర్మానం లేకుండా రూ.20 లక్షలతో చేపట్టిన గెస్ట్ హౌజ్‌లు, సైడ్ డ్రైనేజీలు, చికెన్ షెడ్లు నిర్మాణాల్లో జరిగిన అవినీతిపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులను కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యోరి యానయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మురుకుట్ల నరేందర్, నాయకులు సిద్ధాబత్తుల జగదీష్, కొమురం బాలయ్య, తాలూకా సంపత్, ఆకు పవన్, కర్రి నాగేందర్ బాబు, కొమురం సారయ్య, పొలెబొయిన రాంబాబు, ఫయాజ్ పాల్గొన్నారు.