Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేలాడుతున్న విద్యుత్ తీగలు
- ఫిర్యాదు చేసినా అధికారుల నిర్లక్ష్యం
నవతెలంగాణ-పోచమ్మమైదాన్
నగరంలోని 12వ డివిజన్ మార్కండేయ కాలనీలో విద్యుత్ స్తంభం ఒక పక్కకి వంగి ప్రమాదకరస్థితిలో ఉంది. విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ స్తంభం ప్రక్కనే చేతిపంపు ఉండటంతో నీటి కోసం వచ్చేవారు స్తంభం ఎప్పుడు పడిపోతుందని జంకుతున్నారు. ఏదైనా పెను ప్రమాదం సంభవిస్తే తప్ప అధికారులు స్పందిచరా అని ప్రశ్నిస్తున్నారు.
వేలాడుతున్న విద్యుత్ తీగలు...
కాలనీలోని వీధుల్లో చాలా చోట్ల విద్యుత్ తీగలు వేలాడుతూ కనిపిస్తున్నాయి. వర్షాకాలం కావడంతో చిన్నపాటి గాలి వానకే తీగలు ఒకదానికొకటి తాకి మంటలు చెలరేగి, విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని కాలనీవాసులు వాపోయారు. చాలా చోట్ల విద్యుత్‌తీగలు చెట్ల కొమ్మలకు ఆనుకొని ఉన్నాయని, చెట్లకొమ్మలను తొలగించాలని విద్యుత్ సిబ్బందిని కోరినా వారు పట్టించుకోవడం లేదన్నారు. రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు ఫ్యూజ్ ఆఫ్ కాల్ నంబర్‌కి ఫోన్ చేసిన సిబ్బంది ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.
పట్టించుకోని అధికారులు...
స్తంభం ఒక పక్కకు వంగి ప్రమాదకరంగా ఉం దని ఫిర్యాదు చేసినా విద్యుత్ శాఖ ఏఈ స్పందించ డం లేదని కాలనీవాసులు వాపోయారు. వీధిదీపాల నిర్వహణ సక్రమంగా లేదని, పగలంతా వీధిదీపాలు వెలుగుతున్న అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. వీధిదీపాల నిర్వహణ సక్రమంగా చేపట్టి విద్యుత్ వృధాను అరికట్టాలని కోరుతున్నారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని వెంటనే తొలగించి, కొత్త స్తంభం ఏర్పాటు చేయాలని, వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేసి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని కాలనీవాసులు కోరుతున్నారు.