Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-విలేకరులు
కరోనా విపత్కర పరస్థితుల్లోనైనా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న సిబ్బందిని, ఆశా వర్కర్లను, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌ను కనీస వేతనాలు అమలు చేసి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం ఆందోళనలు నిర్వహించారు. వరంగల్ అర్బన్, రూరల్, ములుగు, భూపాలపల్లి జయశంకర్, జనగామ, మహబూబాబాద్ జిల్లా, మండల కేంద్రాల్లోనే కాకుండా పలు గ్రామాల్లోనూ నిరసన తెలిపారు.
ములుగు : సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏరియా ఆస్పత్రి ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడారు. కరోనా విపత్కర పరస్థితుల్లోనైనా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న సిబ్బందిని, ఆశా వర్కర్లను, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌ను కనీస వేతనాలు అమలు చేసి పర్మినెంట్ చేయాలని, ప్రజలందరికీ ఉచిత టీకాలు కేంద్రమే రాష్ట్రాలకు ఇవ్వాలని నినాదాలు చేశారు. ఏరియా ఆస్పత్రులో పని చేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్ సిబ్బంది 3 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు ఇవ్వాలని, కార్మికులను బానిసత్వంలోకి నెట్టే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు రూ.50 లక్షలు బీమా అందించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మండలంలోని మల్లంపల్లి, సర్వాపూర్, రామచంద్రాపూర్, పత్తిపల్లి, అబ్బాపూర్, బండారుపల్లి, ఇంచర్ల గ్రామాల్లోనూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బోడ రమేష్, గుండెబోయిన రవి గౌడ్, మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జగ్గు నాయక్, ఆశావర్కర్లు నీలాదేవి, స్వాతి, జ్యోత్స్న, ఆస్పత్రి సిబ్బంది శ్రీను, కుమార్, భాస్కర్, అజిత, తిరుపతి, కళావతి, అరుణ, బీరువా వర్కర్స్ సాంబయ్య, రవి, గోపీ, తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలో, వివిధ సెంటర్లలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుంట ఉపేందర్, ఆకుల రాజు మాట్లాడారు. కరోనా ఉధృతి వేళ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడం, పొడిగించడం తప్ప కార్మిక వర్గానికి ఆర్థిక తోడ్పాటు అందించడం లేదన్నారు. ప్రధాని మోడీ అదానీ, అంబానీ సేవలో మునిగి తేలుతున్నాడని ధ్వజమెత్తారు. నిరసన కార్యక్రమాలకు యూనియన్ పట్టణ కన్వీనర్ కుమ్మరికుంట్ల నాగన్న అధ్యక్షత వహించగా నాయకులు వాసం దుర్గారావు, పాలబిందెల మల్లయ్య, తోట శ్రీను, జనార్ధన్, వెంకన్న, రవి, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
జనగామ : జిల్లా కేంద్రంలో సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాలను ఎండగట్టారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కోశాధికారి జోగు ప్రకాష్, జిల్లా కమిటీ సభ్యులు బెస్లింగ్టన్, ప్రశాంత్, మచ్చ వెంకన్న, బొట్ల నాగరాజు, నర్సయ్య, చిర్ర శ్రీను, గుండె మల్లేష్, రాములు, యాకస్వామి, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
వెంకటాపూర్ : మండల కేంద్రంలో, కేశవాపూర్, నల్లకుంట, పాలంపేట, తిమ్మాపూర్, గుర్రంపేట, తదితర గ్రామాల్లోని సబ్‌సెంటర్ల ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల యూనియన్ మండల నాయకులు మాధవి, రాణీ మాట్లాడారు. కార్యక్రమంలో ఆశావర్కర్లు పూర్ణ, సంధ్య, రమాదేవి, హేమలత, కవిత, జ్యోతి, సరోజన, సబిత, అనిత, శ్రీమతి, స్వాతి, తదితరులు పాల్గొన్నారు.
గోవిందరావుపేట : మండల వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో, సబ్ సెంటర్ల ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ మండల నాయకులు పద్మా రాణి, వనిత మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, ఆశా కార్యకర్తలు భాగ్య, రాధ, సంధ్య, రమాదేవి, కవిత, సరిత, ఆదిలక్ష్మీ, సరోజన,,అనిత, నాగమణి, పద్మ పాల్గొన్నారు.
మంగపేట : మండలంలోని మంగపేట, బ్రాహ్మణపల్లి, కమలాపూర్, చెరుపల్లి, దోమెడ, నర్సింహసాగర్, మల్లూరు, బోరునర్సాపూర్, రామచంద్రునిపేట, తిమ్మంపేట తదితర గ్రామాల్లోని సబ్ సెంటర్ల ఎదుట ఆశావర్కర్లతో కలిసి సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ నాయకుడు వంగేటి వెంకట్‌రెడ్డి, ప్రభావతి మాట్లాడారు. కార్యక్రమంలో ఆశావర్కర్లు నాగమణి, సుజాత, కనకలక్ష్మీ, వసంత, చంద్రవాణి, రజిత, శోభ, సరిత, కష్ణ, తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి : మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు చిట్యాల సోమన్న, ఏఓఐ రాష్ట్ర నాయకులు సోమ అశోక్ బాబు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు మాసంపల్లి నాగయ్య, ఎడ్ల భిక్షపతి, మంద సంపత్, లావుడ్య అనిల్ చౌహన్, కుంట శ్రీను, గడ్డం పరశురాములు, మరిపెల్లి ఉప్పలయ్య, కుమార్, దేశబోయిన రాములు, మైబు, వెంకన్న, సమ్మయ్య, యాకయ్య, చిక్కుడు మల్లయ్య, చెరుపల్లి నర్సయ్య, ప్రశాంత్, జోగు యాకయ్య, మానుపాటి అయోధ్య, రాపాక చింటూ, మచ్చ స్వామి, గాదెపాక కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.
రఘునాథపల్లి : మండల కేంద్రంలో, వివిధ గ్రామాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ మండల కన్వీనర్ పొదల నాగరాజు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు టి ఎల్లయ్య, పొనగంటి వెంకటమల్లు, ఇట్టవెని గట్టయ్య, కొలిపాక దశరథ, ముపిడి రాజు, పొదల శ్రీనివాస్, మీసరగండ్ల సత్తయ్య, ఉప్పరి ఆంజనేయులు, కుంట స్వామి, ఎల్లయ్య, రాజు, వేణు, రాములు, యాకయ్య, వెంకటేష్, గణేష్, వెంకన్న, కొమురయ్య, మల్లయ్య, ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు,
కేసముద్రం రూరల్ : మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో సీఐటీయూ మండల కార్యదర్శి జల్లే జయరాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాడబోయిన శ్రీశైలం, జయరాజ్ మాట్లాడారు. కార్యక్రమంలో బీసీ సబ్ ప్లాన్ మండల నాయకుడు జంగిటి కొమురయ్య, సీఐటీయూ నాయకులు రాజ్‌కుమార్, చింతల కుమార్, మట్టె కృష్ణ, రాజు, తదితరులు పాల్గొన్నారు.
బయ్యారం : మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ మండల కన్వీనర్ వల్లాల వెంకన్న మాట్లాడారు. కార్యక్రమంలో హమాలీ, గ్రామ పంచాయతీ, స్ట్రీట్ వెండర్స్, ఆటో కార్మికులు యాకూబ్, శ్రీను, లక్ష్మీ, స్వరూప, తదితరులు పాల్గొన్నారు.
గార్ల : మండలంలోని పినిరెడ్డిగూడెంలో సీపీఐ(ఎం) మహిళా గ్రామ శాఖ ఆద్వర్యంలో, మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో సివిల్ సప్లై హమాలీ శాఖ, రైస్ మిల్లు హమాలీ శాఖ, పంచాయతీ వర్కర్స్, ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర నాయకుడు వంగూరి రాములు, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కందునూరి శ్రీనివాస్ మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, అప్పిరెడ్డి, వీరస్వామి, నాగమణి, మల్లయ్య, ఇస్తారి, మహేశ్వరావు, హరి, పద్మ, రాణీ, ఝాన్సీ, రమేష్, సర్వయ్య, తదితరులు పాల్గొన్నారు.