Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏసిరెడ్డినగర్ వాసులను ఇబ్బందులకు గురిచేయొద్దు
- సీఎం కేసీఆర్కు లేఖ రాస్తా
- ఇండ్లు ఇచ్చే వరకు కదిలేది లేదు.. : జి నాగయ్య
నవతెలంగాణ-జనగామ
రాజకీయ దురుద్ధేశ్యంతోనే ఏసిరెడ్డినగర్ కాలనీవాసులను ఇబ్బందులకు గురి చేస్తున్నా రని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం విమర్శించారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్కు లేఖ రాస్తానని చెప్పారు. బాణాపురం లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఏసిరెడ్డినగర్ కాలనీ వాసులు గురువారం చేపట్టిన నిరసనకు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు జి నాగయ్యతో కలిసి తమ్మినేని సందర్శించారు. ఆందోళన కారు లకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా తమ్మి నేని మాట్లాడారు. కలెక్టరేట్ నిర్మాణం కోసం స్థలం అప్పగిస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఇబ్బందు లకు గురి చేయడం సరికాదన్నారు. గుడిసె వాసులు స్థలాలను అప్పగించి నాలుగేండ్లు గడచినా, ఇండ్ల నిర్మాణం పూర్తైనా అప్పగించడం లేదని విమర్శించారు. ఈ క్రమంలో విసిగి వేసారిలన గుడిసెవాసులు ఇండ్లను ఆక్రమించా రని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి డబుల్ బెడ్రూం ఇండ్లు అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఇండ్లు ఇచ్చే వరకు కదిలేది లేదు.. : జి నాగయ్య
బాణాపురంలో నిర్మించిన ఇండ్లు అప్పగించే వరకు గుడిసెవాసులు దీక్ష నుంచి కదిలేది లేదని సీపీఐ(ఎం) కేంద్ర కమిటలీ సభ్యుడు జి నాగయ్య తెలిపారు. గుడిసెవాసులను ఇబ్బందు లకు గురి చేయడం దుర్మార్గమన్నారు. గుడిసె వాసులకు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇండ్లు అప్పగించి దీక్షలను విరమింపజేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు ఎదునూరి వెంకట్రాజం, ఇర్రి అహల్య, రాపర్తి రాజు, జిల్లా కమిటీ సభ్యులు, బూడిది గోపీ, ఉపేందర్, సాంబరాజు యాదగిరి, బొట్ల శేఖర్, రాపర్తి సోమన్న, సింగారపు రమేష్, బోడ నరేందర్, పట్టణ నాయకులు జోగు ప్రకాష్, మహ్మద్ అజహరుద్దీన్, దస్తగిరి, లలిత, కళ్యాణి, లింగం, తదితరులు పాల్గొన్నారు.