Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన
నవతెలంగాణ-జనగామ
కార్మికులను కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రం లోని టీఆర్ఎస్ పాలకులు ఆదుకోవాలని సీఐ టీయూ నేతలు డిమాండ్ చేశారు. ఆ యూని యన్ కమిటీ పిలుపు మేరకు వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని వరంగల్ అర్బన్, రూరల్, ములుగు, భూపాలపల్లి జయశంకర్, మహ బూబాబాద్, జనగామ జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో గురువారం పెద్దఎత్తున ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ నాయకులు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కార్మికులు ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.